Vedhika: ‘యక్షిణి’గా ఆకర్షిస్తోన్న వేదిక.. మళ్లీ బిజీ తారగా!

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:05 PM

‘బాహుబలి’ మేకర్స్ నుంచి వచ్చిన సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ ‘యక్షిణి’లో టైటిల్ పాత్రలో నటించింది నటి వేదిక. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ మంచి ఆదరణను రాబట్టుకోవడంతో పాటు, ఆమె పాత్రకు మంచి పేరు వస్తుండటంతో.. మరోసారి ఆమె పేరు టాలీవుడ్‌లో బాగా వినబడుతోంది.

Vedhika: ‘యక్షిణి’గా ఆకర్షిస్తోన్న వేదిక.. మళ్లీ బిజీ తారగా!

‘బాహుబలి’ (Bahubali) మేకర్స్ నుంచి వచ్చిన సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ ‘యక్షిణి’ (Yakshini)లో టైటిల్ పాత్రలో నటించింది నటి వేదిక. ఇందులో ఆమె నటనకు మంచి స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘ముని, బాణం, కాంచన 3’ వంటి హిట్ చిత్రాలతో వేదిక తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది. అంతేకాదు, నటసింహం బాలయ్య ‘రూలర్’ (Ruler) చిత్రంలోనూ ఆమె నటించింది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కాస్త దూరమైనప్పటికీ.. ప్రస్తుతం ఆమె మూవీస్, వెబ్ సిరీస్‌లతో బిజీ నటిగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ (Yakshini Web Series) మంచి ఆదరణను రాబట్టుకోవడంతో పాటు, ఆమె పాత్రకు మంచి పేరు వస్తుండటంతో.. మరోసారి ఆమె పేరు టాలీవుడ్‌లో బాగా వినబడుతోంది. ఈ వెబ్ సిరీస్ తర్వాత టాలీవుడ్‌లోనూ ఆమె బిజీ నటిగా మారే అవకాశం అయితే లేకపోలేదు.

Also Read-Chiranjeevi: ఆ వెబ్ సిరీస్ చూసిన చిరు.. రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్!


Vedhika-2.jpg

‘యక్షిణి’ విషయానికి వస్తే.. ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘యక్షిణి’. ఈ వెబ్ సిరీస్‌ను ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల మేకర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ‘అర్జున ఫల్గుణ, జోహార్, కోటబొమ్మాళి పీఎస్’ చిత్రాల దర్శకుడు తేజ మార్ని ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ (Disney plus Hotstar)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

vedhika-1.jpg

Updated Date - Jun 20 , 2024 | 10:05 PM