Brinda: త్రిష టైటిల్‌ పాత్రలో క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్.. ఏ ఓటీటీలో, ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:18 PM

అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే అంటున్నారు ‘బృంద’ టీమ్. సూర్య మనోజ్‌ వంగాలా గ్రిప్పింగ్‌గా రాసి, డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘బృంద’. టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ ఈ సిరీస్‌తోనే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు.

Brinda Web Series Poster

అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే అంటున్నారు ‘బృంద’ టీమ్. సూర్య మనోజ్‌ వంగాల (Surya Manoj Vangala) గ్రిప్పింగ్‌గా రాసి, డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘బృంద’ (Brinda). టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ (Trisha Krishnan) ఈ సిరీస్‌తోనే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు హైలెట్ కానుండగా.. శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. యాడింగ్ అడ్వర్టైజింగ్ LLP బ్యానర్‌పై కొల్లా ఆశిష్ (Kolla Ashish) ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. సోనీ లివ్‌లో ఆగస్ట్ 2 నుంచి ఈ ‘బృంద’ వెబ్‌ సిరీస్ తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో స్ట్రీమింగ్‌కు రానుంది.

ఈ సిరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ.. ‘సోనీ లివ్‌’ (Sony Liv) ద్వారా పాన్ ఇండియా ఆడియన్స్‌ని ‘బృంద’ సిరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. ‘బృంద’ సిరీస్ ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఈ సిరీస్‌ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉండటమే కాదు, ప్రతి ఒక్కరూ అప్పటి వరకు నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది. అత్యద్భుతమైన, శక్తిమంతమైన, ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో తెరకెక్కిందీ ‘బృంద’. ఈ సిరీస్‌ని డైరెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కథానుగుణంగా ‘బృంద’ పాత్రలో అత్యద్భుతమైన లేయర్స్‌ని జనాలు విట్‌నెస్‌ చేస్తారు. త్రిషగారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటి వరకు ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు, సిరీస్‌లకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ‘బృంద’ ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను’’ అని అన్నారు. (Brinda Web Series Teaser Out)


Trisha.jpg

ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు. డ్రామా, క్రైమ్‌, మిస్టరీ అంశాలతో... చూసినంత సేపూ ఒళ్లు గగుర్పొడిచేలా ఈ సిరీస్ ఉంటుందని.. ఆగస్ట్ 2 నుంచి సోనీ లీవ్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవడం పక్కా అనేలా ఈ ‘బృంద’ సిరీస్ బృందం తెలుపుతోంది. తాజాగా వదిలిన టీజర్ చూస్తుంటే కూడా అదే అనిపిస్తోంది.

Updated Date - Jul 09 , 2024 | 04:18 PM