Nindha OTT: వరుణ్‌సందేశ్‌ ‘నింద’కు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్

ABN , Publish Date - Sep 07 , 2024 | 08:07 PM

ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌ నటన హైలైట్‌ అనేలా విమర్శకులు సైతం కొనియాడారు. థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్నే సాధించిన ఈ చిత్రం ఈ నెల 6 నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది.

Nindha Movie Poster

కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయినా.. ఓటీటీలో సరిగా ఆదరణను నోచుకోవు. అలాగే కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలాంటి స్పందనను అయితే రాబట్టుకుంటాయో.. అంతకుమించిన స్పందనను ఓటీటీలో రాబట్టుకుని సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలుస్తాయి. వీటిలో రెండవ కోవకి చెందిన చిత్రంగా ‘నింద’ సినిమా అటు థియేటర్లలో రాబట్టుకున్నట్టే.. ఇటు ఓటీటీలో మంచి ఆదరణను రాబట్టుకోవడం విశేషం. థియేటర్‌లో సందడి చేసిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కోసం కొందరు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అలా ఎదురుచూసిన సినిమాలలో ఒకటిగా వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) ‘నింద’ (Nindha) నిలిచింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళుతోంది.

Also Read- Game Changer: అభిమానుల నిరీక్షణ ఫలించింది.. అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్

ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘నింద’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌ నటన హైలైట్‌ అనేలా విమర్శకులు సైతం కొనియాడారు. థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి విజయాన్నే సాధించిన ఈ చిత్రం ఈ నెల 6 నుంచి ఈటీవీ విన్‌ (Etv Win) ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో ‘నింద’ చిత్రం టాక్‌ ఆఫ్‌ ద ఓటీటీగా నిలవడం విశేషం. ముందు ముందు నింద ఓటీటీలో మరింత వేగంగా దూసుకెళ్లి రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుందంటే.. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి అది నిజం అవుతుందేమో చూద్దాం.


Nindha.jpg

వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా.. వరుణ్ సందేశ్‌ నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వుండే ఈ చిత్రం ఓటీటీలో మరింత మంది ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం వుందని దర్శకనిర్మాత రాజేష్ జగన్నాధం తెలిపారు. అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై వంటివారు ఇందులో ఇతర ముఖ్య తారాగణంగా నటించారు.

Read Latest Cinema News

Updated Date - Sep 07 , 2024 | 08:09 PM