ARM: ఓటీటీకి వచ్చేసిన.. టొవినో థామస్ యాక్షన్ అడ్వెంచర్! డోంట్ మిస్.. థ్రిల్ గ్యారంటీ
ABN , Publish Date - Nov 08 , 2024 | 07:04 AM
'మిన్నల్ మురళీ’, ‘2018’ ఫేమ్ టొవినో థామస్ నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ‘ఏఆర్‌ఎమ్’ (ARM) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు టొవినో థామస్ (Tovino Thomas). లూసిఫర్‌లో మోహన్‌లాల్‌కి తమ్ముడిగా, 'మిన్నల్ మురళీ’, ‘2018’, పోరెన్సిక్, కాళి, మహా నది, వంటి సినిమాలతో ఇక్కడి వారికి మరింతగా చేరువయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన నటించిన కొత్త చిత్రం ‘ఏఆర్‌ఎమ్’ (ARM). ఈ సినిమాను తెలుగు థియేటర్లలోకి తీసుకురావడమే కాక హైదరాబాద్‌కు వచ్చి ప్రమోషన్లు సైతం అదే స్థాయిలో చేశాడు. మన బేబమ్మ కృతి శెట్టి (Krithi shetty) ఈ మూవీలో కథానాయిక. టొవినో 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన మంచి ఆదరణను దక్కించుకుని విజయం సాధించి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. సుమారు రెండు నెలల గ్యాప్ తర్వాత ఈ శుక్రవారం (నవంబర్ 8) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. అజయన్ (టోవినో థామస్) కేరళలోని ఓ ఊరిలో ఎలక్ట్రీషియన్. తన తాత మణియన్ కాలంలో చేసిన ఓ దొంగతనం ఆ తర్వాతి తరమైన అజయన్‌కు కూడా చుట్టుకుని ఆ గ్రామంలో అతని కుటుంబానికి అసలు గౌరవం ఇవ్వరు. ఆ ఊర్లో ఏ దొంగతనం జరిగినా పోలీసులు ముందుగా అజయ్‌నే అనుమానిస్తుంటారు. అయితే ఓరోజు ఆ ఊరి గుడిలోని చాలా మహిమ కలిగిన శ్రీభూతి దీపం (అమ్మవారి ప్రతిమ) దొంగతనం జరుగుతుంది. అది కాస్త అజయ్ మీదకు వస్తుంది. ఇంతకు ఆ దొంగతానం అజయనే చేశాడా.. అసలు ఆ విగ్రహం వెనక ఉన్న చరిత్ర ఏంటి? దానిని అప్పట్లో అజయ్ తాత ఎందుకు దొంగిలించాడు? మణియన్, కేలు ఏం చేశారు? ఊరిలో అసలు దొంగ ఎవరు? మరో పక్క గ్రామ పెద్ద నంబియార్ కూతురితో అజయ్ ప్రేమ ఏ పరిస్థితులకు దారి తీసింది. ఈ కథలో అజయ్ తల్లి (రోహిణి) పాత్ర ఏంటి? ఆ ఊరికి సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఎందుకు వచ్చాడు? అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుంది. (ARM )
‘ఏఆర్‌ఎమ్’ (అజయంతే రంధం మోషణమ్) అంటే తెలుగులో అజయ్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. కేలు, మణియన్, అజయన్ అనే మూడు తరాల వ్యక్తులకు లింక్ చేస్తూ తీసిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. కింజ కేలు అనే యోధుడు తన ప్రతిభతో అక్కడి రాజును మెప్పించి కానుకగా తన గ్రామానికి తీసుకువచ్చిన ఓ విగ్రహం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. రెండో తరంలో మణియన్ ఆ విగ్రహాన్ని దొంగిలించడం మూడో తరంలో మనుమడు అజయన్ చేసిన ఆ విగ్రహం కోసం చేసిన హంట్ మూవీ చూసే ప్రతి ఒక్కరికీ మంచి థ్రిల్ ఇస్తుంది. అదేవిధంగా మణియన్ మనవడు అజయన్‌కు ఇద్దరికీ సమాజం నుంచి ఒకే తరహా పరిస్థితులు ఎదురవడం అది చూయించిన విధానం భలే ఉంటుంది. ఆ రెండు పాత్రలు ఒకే ప్రాంతంతో ముడి పడడం ఆ సమయంలో రోహిణి నటన అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడీ సినిమా ‘ఏఆర్‌ఎమ్’ (ARM) ఈ రోజు (నవంబర్8) నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. సో ఎవరైతే థియేటర్లలో ఈ ‘ఏఆర్‌ఎమ్’ మూవీని మిస్సయ్యారో, మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారో వారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఇంటిల్లి పాది కలిసి హాయిగా చూడవచ్చు. థ్రిల్ అవ్వొచ్చు.