Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:06 AM

తెలుగు ఓటీటీ ఆహా మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఆ రెండింటిలో ఒకటి మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెరిక్ అబ్రహం’ కాగా.. రెండోది షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్‌లో నటించిన థ్రిల్లర్ ‘బర్త్ మార్క్’. ఈ రెండూ మస్ట్ వాచ్ థ్రిల్లర్స్‌గా ఆహా ప్రమోట్ చేస్తోంది.

Birthmark and Derick Abraham Movie Stills

తెలుగు ఓటీటీ ఆహా మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఆ రెండింటిలో ఒకటి మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెరిక్ అబ్రహం’ (Derick Abraham) కాగా.. రెండోది షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్‌లో నటించిన థ్రిల్లర్ ‘బర్త్ మార్క్’ (Birthmark). ఈ రెండూ మస్ట్ వాచ్ థ్రిల్లర్స్‌గా ఆహా ఓటీటీ (Aha OTT) ప్రమోట్ చేస్తోంది.

Also Read- Prabhas: ప్రభాస్ ఫర్ ఏ రీజన్.. వయనాడ్ బాధితుల సహాయార్థం భారీ విరాళం

మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెరిక్ అబ్రహం’ విషయానికి వస్తే.. షాజీ పాడూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ‘డెరిక్ అబ్రహం’ మూవీ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్. కథ, స్క్రీన్‌ప్లే, పెర్ఫార్మెన్సెస్ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి.


Mammotty-Movie.jpg

‘బర్త్ మార్క్’ విషయానికి వస్తే.. విక్రమ్ శ్రీధరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్‌‌లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆర్మీ లెఫ్టినెంట్ డేనియల్‌గా షబీర్ (Shabeer Kallarakkal), అతని భార్య జెన్నిఫర్‌గా మిర్నా మీనన్ (Mirnaa Menon) తమ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు. ‘సీతారామం’ ఫేం విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్. థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ‘బర్త్ మార్క్’ ఆడియన్స్‌‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇప్పుడీ రెండు సినిమాలు ‘భవానీ మీడియా’ (Bhavani Media) ద్వారా ఆహాలో రిలీజ్ అవుతున్నాయి. గురువారం(8th) నుంచి ‘బర్త్ మార్క్’, శనివారం (10th) ‘డెరిక్ అబ్రహం’ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండు ఎక్సయిటింగ్ మూవీస్‌తో ఈ వీకెండ్ ఆహాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ ఆన్‌గా ఉండబోతోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మస్ట్ వాచ్ థ్రిల్లర్స్‌ని మిస్ అవ్వకుండా చూసేయండి.

Read Latest Cinema News

Updated Date - Aug 08 , 2024 | 12:06 AM