ఆహాలో దూసుకుపోతోన్న ‘ది బర్త్‌డే బాయ్’

ABN , Publish Date - Aug 11 , 2024 | 11:42 PM

కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ది బర్త్ డే బాయ్’ అనే చిత్రం థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక ఇప్పుడు ఆహాలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది.

కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ది బర్త్ డే బాయ్’ (The Birthday Boy) అనే చిత్రం థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఓ ఐదుగురు స్నేహితుల చుట్టూ జరిగే ఈ కథకు జనాలు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఆహాలోనూ (Aha OTT) ఈ చిత్రం దూసుకుపోతోంది.

ఐ భరత్ నిర్మించిన ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఈ చిత్రాన్ని బిగ్ ఫిష్ సంస్థ ఆహాలోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆహాలోనూ ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని రకాల అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ మూవీకి ఇప్పుడు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది.

tbb-aha.jpg

ప్రశాంత్ శ్రీనివాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. కథలోని టెన్షన్, ఎమోషన్‌ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది. సంకీర్త్ రాహుల్ విజువల్స్, కెమెరా పనితనం సినిమాలో లీనమయ్యేలా చేస్తుండటంతో ప్రేక్షకులకు బెస్ట్ చాయిస్‌గా ఈ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది. రవికృష్ణ, సమీర్ మల్ల, రాజీవ్ కనకాల వంటివారు ప్రధాన పాత్రలలో నటించారు.

Updated Date - Aug 11 , 2024 | 11:57 PM