Thangalaan: ఓటీటీకి లైన్ క్లియర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:30 PM

విక్రమ్‌ (Vikram)ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ‘

విక్రమ్‌ (Vikram)ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ‘తంగలాన్‌’ ఓటీటీ విడుదల నిలిపేయాలంటూ మద్రాసు కోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని మతాలను కించపరిచారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొంది థియేటర్‌లో విడుదలైంది కాబట్టి ఓటీటీ విషయంలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. ఓటీటీ విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. తాజాగా నెట్‌ప్లిక్స్‌ (Netflix) వేదికగా అందుబాటులోకి వచ్చింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. పా..రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు కథానాయికలు.  


కథ...
1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంతో జరిగే కథ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్‌ (విక్రమ్‌). అతని భార్య గంగమ్మ (పార్వతి తిరువొత్తు). వీళ్లకు ఐదుగురు పిల్లలు. వాళ్లు పండించిన పంటను ఓసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు. సరిగ్గా అప్పుడే తెల్లదొర క్లెమెంట్‌ (డేనియల్‌) వేపూరుకు వస్తాడు. ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానని ఆశ చూపుతాడు. అయితే ఆ అడవిలో బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలో కనిపిస్తుంటుంది. మరి నిజంగా ఆరతి ఉందా? బంగారాన్ని వెలికి తీేసందుకు బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్లిన తంగలాన్‌కు.. అతని బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? అన్నది కథ. 

Updated Date - Dec 10 , 2024 | 12:39 PM