Dear Nanna: ఆహాలో అదిరే రెస్పాన్స్..

ABN , Publish Date - Jun 15 , 2024 | 10:32 AM

చైతన్య రావు, యష్ణ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ వంటివారు ఇతర పాత్రలలో పోషించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఫాదర్ డే స్పెషల్‌గా ఈ చిత్రం జూన్ 14న ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కి వచ్చింది. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు టాప్ రేటింగ్స్ పడుతున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది.

Dear Nanna: ఆహాలో అదిరే రెస్పాన్స్..
Dear Nanna Movie Still

చైతన్య రావు, యష్ణ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డియర్ నాన్న’ (Dear Nanna). సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ వంటివారు ఇతర పాత్రలలో పోషించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఫాదర్ డే స్పెషల్‌గా ఈ చిత్రం జూన్ 14న ఆహా ఓటీటీ (Aha OTT)లోకి స్ట్రీమింగ్‌కి వచ్చింది. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు టాప్ రేటింగ్స్ పడుతున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. కరోనా బ్యాక్ డ్రాప్‌లో ఫాదర్ సన్ ఎమోషన్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా కంటెంట్‌ని ఆదరిస్తోన్న ఆడియన్స్‌కు చిత్రయూనిట్ కూడా ధన్యవాదాలు తెలిపింది.

Also Read-Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే...

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావు (Chaitanya Rao) తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎంతో ఎఫెక్టివ్‌గా ఇందులో చూపించారు. తండ్రి కొడుకులుగా నటించిన చైతన్య రావు, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. మెడికల్ షాప్ తనకి బిజినెస్ కాదని చెప్పే సన్నివేశాలు ఆకట్టుకునేలానే కాకుండా హార్ట్ టచింగ్ చిత్రీకరించారు. ముఖ్యంగా కరోనా సమయంలో మెడికల్ షాప్‌ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలు, చూపిన తెగువని దర్శకుడు ఇందులో చాలా ఎఫెక్టివ్‌గా చూపించినట్లుగా టాక్ వినబడుతోంది.

Also Read- Harom Hara Movie Review: ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సుధీర్ బాబుకి హిట్ వచ్చిందా...


Chaitanya-Rao.jpg

చైతన్య రావు నటన, యష్ణ చౌదరి స్క్రీన్ ప్రజెన్స్, సూర్య కుమార్ భగవాన్ దాస్‌తో పాటు సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ సహజమైన నటనతో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. అనిత్ కుమార్ మాధాడి కెమెరా పనితనం, గిఫ్టన్ ఎలియాస్ నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఎమోషన్స్, వేల్యుబుల్ స్టొరీ, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే వంటి వాటితో వచ్చిన ‘డియర్ నాన్న’ (Dear Nanna Movie) ఈ వీకెండ్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీగా స్ట్రీమ్ అవుతున్నట్లుగా ఆహా వెల్లడించింది.

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 10:59 AM