Ooru Peru Bhairavakona: సర్‌ప్రైజ్‌గా ఓటీటీలోకి.. దుమ్మురేపుతోన్న ఊరు పేరు భైరవకోన
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:48 PM
సందీప్ కిషన్ వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా వచ్చిన చిత్రం ఊరు పేరు భైరవకోన. సోషియో ఫాంటసీ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం కొన్ని థియేటర్లలో నడుస్తుండగానే ఉన్నట్టుండి సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ తీసుకు వచ్చారు.
సందీప్ కిషన్ (Sundeep Kishan), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), కావ్య థాపర్ జంటగా వచ్చిన చిత్రం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో సంచలన విజయం సాధించింది. సోషియో ఫాంటసీ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం చిన్నపిల్లలో సహా పెద్ద వాళ్లందరినీ బాగా ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా ప్రస్తుతం కొన్ని థియేటర్లలో నడుస్తుండగానే ఉన్నట్టుండి సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ తీసుకు వచ్చారు. దీంతో వరుసగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో ఫ్యామిలీ అంతా ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలోకి రావల్సిన హనుమాన్ సినిమా వాయిదా పడడంతో చాలా మందికి ఈ సినిమానే ఫస్ట్ ఛాయిస్‌గా ఉంది.
కథ విషయానికి వస్తే.. హీరో తన స్నేహితునితో కలిసి ఓ భారీ దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో భైరవకోన అనే గ్రామంలోకి వెళ్లిపోతాడు. తీరా ఆక్కడికి వెళ్లాక వారికి చిత్ర, విచిత్ర సంఘటనలు ఎదురౌతుంటాయి. ఆ ఊరు నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నాలు చేసినా వీలుపడదు ఈ నేపథ్యంలో వారి వద్ద ఉన్న బ్యాగును ఆ ఊరిలోని ఓ ముఠా దొంగిలిస్తారు. ఈక్రమంలో ఆ బ్యాగును తిరిగి తీసుకు వచ్చే క్రమంలో హీరోకు ఎదురైన వింత ఘటనలు, అసలు ఆ హీరో ఆ ఊరికే ఎలా వచ్చాడు అనే ఆసక్తికరమైన కతతో చివరివరకు చూసే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ప్రధానంగా పిల్లలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవడం ఖాయం.
అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నట్టుండి మహా శివరాత్రి (Maha Shivaratri) రోజున ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) లోకి రావడంతో ఓటీటీ ప్రియులకు కాస్త ఆశ్యర్యమనిపిం చినా సినిమాను చూస్తు ఇంటిల్లిపాది బాగా ఎంజాయ్ చేస్తునారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పించగా రాజేశ్ దండా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. గతంలో సందీప్ కిషన్‌తో టైగర్, నిఖిల్‌తో ఎక్కడికి వెళతావు చిన్నవాడ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ ఈ సినిమాకు డైరెక్షన్ చేయడం విశేషం.