Modern Masters: ఓటీటీలో.. మెస్మ‌రైజ్ చేస్తున్నరాజమౌళి ‘మోడరన్ మాస్టర్స్’

ABN , Publish Date - Aug 06 , 2024 | 08:28 PM

ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఒరిజిన‌ల్ సిరీస్ మోడ్ర‌న్ మాస్టర్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అద్భుత స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటుంది.

rajamouli

ఇటీవ‌లనెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఒరిజిన‌ల్ సిరీస్ మోడ్ర‌న్ మాస్టర్స్ (Modern Masters) ప్ర‌పంచ వ్యాప్తంగా అద్భుత స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటుంది. ఈ సిరీస్‌లో శాంతినివాసం సీరియల్ నుంచి ఆస్కార్ గెలుపు వరకు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అద్భుత సినీ ప్రయాణం గురించి చ‌ర్చించారు. ఆయన కెరీర్ లోని ముఖ్య ఘట్టాలకు అద్దం పట్టేలా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మోడరన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ రూపొందించింది.

ఈ నెల 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మోడరన్ మాస్టర్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్ ప్రారంభంలో ఒక ప్యాషనేట్ యంగ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ తెరపైకి తీసుకొచ్చిన బిగ్ డైరెక్టర్ గా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలిచి అంతర్జాతీయంగా ఫేమ్ తెచ్చుకున్న మోస్ట్ సెలబ్రేటెడ్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి కెరీర్ లోని ప్రతి దశను అందంగా చూపించింది మోడరన్ మాస్టర్స్ (Modern Masters).


GUCwbK9bMAAFH-u.jpeg

అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్, ఫిల్మ్ కంపానియన్ ఈ సిరీస్ ను నిర్మించాయి. రాఘవ్ కన్నా దర్శకత్వం వహించారు. ఈ మోడరన్ మాస్టర్స్ లో సినిమా మేకింగ్ లో ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేకత, అంకితభావం గురించి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ రూసో బ్రదర్స్, జేమ్స్ కామోరూన్ చెబుతూ ప్రశంసలు అందజేశారు.

Updated Date - Aug 06 , 2024 | 08:28 PM