Manamey OTT Release Date: ఓటిటి లోకి ఇంకో ఫ్లాప్ మూవీ వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ అంటే...

ABN , Publish Date - Jul 04 , 2024 | 04:07 PM

శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన 'మనమే' త్వరలోనే ఓటిటి లో ప్రసారం కానుంది అని తెలిసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 7న థియేటర్స్ లో విడుదలయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అంటే...

A still from Manamey

శర్వానంద్, కృతి శెట్టి జంతంగా నటించిన 'మనమే' సినిమా జూన్ 7 న విడుదలైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అటు విశ్లేషకుల నుండి గానీ, ఇటు ప్రేక్షకుల నుండి అంతగా ఆదరణ లభించలేదని చెప్పాలి. ఈ సినిమాలో విక్రమాదిత్య అనే ఒక చిన్న పిల్లవాడు కూడా ఇంకో ముఖ్య పాత్రలో కనపడతాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది.

శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' 2016లో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఆ తరువాత శర్వానంద్ కి మళ్ళీ అంతటి విజయం రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ 'మనమే' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఈ సినిమా కూడా అతనికి అనుకున్నంత విజయం ఇవ్వలేదనే చెప్పాలి. ఈ ఎనిమిది సంవత్సరాలలో శర్వానంద్ సుమారు ఎనిమిది, తొమ్మిది సినిమాలు చేశాడు కానీ అందులో ఒక్కటి కూడా 'శతమానం భవతి' లాంటి విజయాన్ని ఇవ్వలేదు.
Manamey

ఇప్పుడు ఈ 'మనమే' కూడా సరిగ్గా నడవలేదనే చెప్పాలి. ఈ కథలో భావోద్వేగాలు సరిగ్గా పండలేదు, అలాగే దర్శకుడు ఈ సినిమా కథనం కూడా టీవీ సీరియల్ గా చెప్పాడు అని ఒక విమర్శ నడిచింది. ఈ సినిమా ఎక్కువభాగం విదేశంలో చిత్రీకరించారు, అది కూడా తెలుగు ప్రేక్షకులకి సరిగ్గా కనెక్టు అవలేదనే చెప్పాలి. ఇప్పుడు థియేటర్స్ లో కూడా ఈ సినిమా నడవటం కష్టం అని ఇక ఓటిటి లోకి వచ్చేయడం మంచింది అని అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేస్తోంది అని తెలిసింది.

ఇది కూడా చదవండి:

Manamey Movie Review: శర్వానంద్ కి 'మనమే' హిట్ ఇచ్చిందా...

ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా ఓటిటి హక్కులు కొన్నట్టుగా తెలిసింది. ఈ సినిమాని జులై 12న స్ట్రీమింగ్ చెయ్యాలని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భావిస్తున్నట్టుగా ఒక టాక్ వినపడుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది అని కూడా అంటున్నారు. థియేటర్స్ లో ప్రేక్షకులు అంతగా పట్టించుకోని ఈ సినిమాని కనీసం ఓటిటిలో అయినా చూస్తారో లేదో చూడాలి మరి.

Updated Date - Jul 04 , 2024 | 04:07 PM