Sathyam Sundaram OTT: కార్తి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. సత్యం సుందరం ఓటీటీకి వచ్చేసింది!డోంట్ మిస్
ABN , Publish Date - Oct 25 , 2024 | 06:58 AM
కార్తీ, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించగా ప్రేక్షకాదరణ పొందిన సత్యం సుందరం చిత్రం ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కార్తీ (Karthi), అరవింద్ స్వామి(Arvind Swami) కీలక పాత్రల్లో నటించగా ఇటీవల థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకాదరణ పొందిన సత్యం సుందరం (Sathyam Sundaram) చిత్రం ఈ రోజు (శుక్రవారం) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గతంలో 96 వంటి కల్ట్ లవ్‌స్టోరీ సినిమాను అందించిన ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 2డీ ఏంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. దసరా సందర్భంగా జూ. ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకోవడమే కాక ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.
కథ విషయానికి వస్తే.. అయిన వారి వళ్ల వచ్చిన ఇబ్బందులతో సొంత ఊరిలో ఇళ్లు కాళీ చేసి సిటీకి వెళ్లిపోతుంది సత్యమూర్తి (అరవింద స్వామి) కుటుంబం. ఆ ఊరిపై ద్వేషం పెంచుకుని ఆ ఊరికెళ్లడం మానేస్తారు. తిరిగి పాతికేళ్లకు చిన్నతనంలో తనతో కలిసి పెరిగిన పెదనాన్న కూతురి పెళ్లి కోసం సత్యం ఆ ఊరికి తప్పకవెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో సుందరం (కార్తీ) బావ బావ అంటూ సత్యంను కలవడం, ఆపై సత్యం ఎంతకు సుందరాన్ని గుర్తు పట్టలేక ఇబ్బందులు పడుతుంటాడు. సరిగ్గా ఆ రోజు రాత్రి సత్యం వెళ్లాల్సిన బస్సు మిస్సవడంతో ఆ రాత్రి సుందరం ఇంట్లోనే గడపాల్సి వస్తుంది. అలాంటిది చివరకు సత్యం సుందరంకు చెప్పకుండానే ఆ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయాడు, అసలు సుందరం ఎవరో సత్యం గుర్తించాడా, అతనితో ఉన్న రిలేషన్ ఏంటో తెలుగుసుకోగలిగాడా అనే సున్నితమైన ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికీ వారి బాల్యం రోజులను గుర్తు చేస్తూ కంటనీరు తెప్పిస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా ఈ రోజు (ఆక్టోబర్ 25) శుక్రవారం తెల్లవారుజాము నుంచే నెట్‌ఫ్లిక్స్ (Netflix) తమిళంతో పాటు తెలుగు,కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా కాలంగా మంచి ఫ్యామిలీ ఎమోషన్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు, తమ పాత రోజులను, తాము నివసించిన ఇంటితో ప్రత్యేక బంధం ఉన్నవారు అంతా కటుంబ సమేతంగా కలిసి ఈ సినిమా చూసి ఆస్వాదిస్తూ తిరిగి ఆ రోజులకు వెళ్లవచ్చు. ముఖ్యంగా కార్తీ, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, ఒకటి రెండు ఎమోషన్ సీన్లు కంటతడి పెట్టించడమే కాక చివరకు ప్రేక్షకుడికి ఓ మధురానుభూతిని ఇస్తుంది. డోంట్ మిస్.