EAGLE: అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లలో కాదు.. ఈగల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ABN , Publish Date - Feb 23 , 2024 | 06:48 PM
మాస్ మహారాజా రవితేజ , అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ జంటగా నటించిన చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కుల గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్య థాపర్ (Kavya Thapar) జంటగా నటించిన చిత్రం ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ (Vishwa Prasad) నిర్మించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి మంచి హిట్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమా ఓటీటీ,శాటిలైట్ హక్కుల గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix), ఆహ (aha video)లతో పోటీ పడి మరి ఈ టీవీ, ఈ టీవీ విన్ (E TV Win) ఈగల్ చిత్ర ఓటీటీ, శాటిలైట్ రైట్స్ హక్కులను దక్కించుకుంది. మార్చి ఫస్ట్ వీక్‌లో ఈటీవీ విన్ (ETV Win) లో ఈగల్ (Eagle) సినిమా విడుదల కానుండగా ఉగాదికి టీవీలో ప్రసారం కానున్నట్లు సమాచారం.
కథ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న మారణాయుధాలు, డ్రగ్స్ చలామణిని తగ్గించేందుకు హీరో చేసే పోరాటం, భార్యను కోల్పోవడం, ఓవైపు దేశంలోని మిలటరీ, రా, మావోయిస్ట్స్, విదేశీ గ్యాంగ్‌స్టర్‌లు హీరోను చంపేందుకు బలగాలను దింపుతాయి. ఈక్రమంలో వారిని హీరో ఎలా ఎదుర్కొన్నాడనే ఆసక్తికర కథనంతో, ఔట్ అండ్ ఔట్ గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలతో (Eagle) సినిమాను రూపొందించారు.