నేరుగా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘రేప్‌ డీ’ మూవీ

ABN , Publish Date - Aug 11 , 2024 | 11:17 PM

విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరోహీరోయిన్లుగా టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్‌పై దేవీ మేరేటీ నిర్మించిన చిత్రం ‘రేప్ డీ’. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది.

విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరోహీరోయిన్లుగా టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్‌పై దేవీ మేరేటీ నిర్మించిన చిత్రం ‘రేప్ డీ’. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ. రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి ప్రకాష్ వేద కథ, మాటలను అందించారు.

‘రేప్ డీ’ చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో రాబోతోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతోన్నారు. ఆగస్ట్ 10 నుంచి రెంటల్ బేస్డ్ మీద బీ సీనీ ఈటీ (B cine et) యాప్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.

BcineEt.jpg

యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కి RAPED100 కూపన్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి ఇతర ఓటీటీ సంస్థలలోనూ అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి, వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సాధ్వి, ప్రణవి సమర్పిస్తున్నారు.

Updated Date - Aug 11 , 2024 | 11:28 PM