Tiragabadara Saami Ott: ఓటీటీకి వ‌చ్చేసిన.. రాజ్ తరుణ్ , మాల్వి మల్హోత్రా ‘తిరగబడరసామీ’

ABN , Publish Date - Sep 19 , 2024 | 02:03 PM

రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంట‌గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

raj tharun

రాజ్ తరుణ్ (Raj Tharun), మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) జంట‌గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి (AS Ravikumar Chowdary) దర్శకత్వంలో రూపొందిన యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’ (Tiragabadara Saami) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా ఆగస్ట్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మన్నారా చోప్రా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌, ఒక స్పెషల్ సాంగ్‌లో అలరించింది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి కీలక పాత్రల్లో న‌టించారు. బిగ్‌బాస్‌ భోలే షావలి, జేబీ సంగీతం అందించారు.

Raj Tharun

క‌త విష‌యానికి వ‌స్తే.. గిరి చిన్న‌త‌నంలోనే త‌ప్పిపోయి హైద్రాబాద్ చేరతాడు. అక్క‌డ ఓ కాల‌నీలో ఉంటూ త‌న లాగే త‌ప్పిపోయిన వారిని వెతికి తిరిగి వాళ్లింటికి చేరుస్తుంటాడు. ఈక్ర‌మంలో వైల‌జ అనే అమ‌మ్ఆయిన ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అదే స‌మ‌యంలో త‌ప్పిపోయిన ఓ వ్య‌క్తిని వెతికి అప్ప‌గించాల‌ని ఆ ప్రాంతంలో చాలా క్రూరుడైన కొండారెడ్డి నుంచి గిరికి ఓ డీల్ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో గిరి అత‌నిని వెతికి ప‌ట్టుకున్నాడా, అత‌నెవ‌రు, అస‌లు శైల‌జ గిరిని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఈ డీల్‌తో గిరి ఎన్ని ర‌కాల ఇబ్బందులు ప‌డ్డాడు అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

Raj Tharun

ఇప్పుడీ సినిమా అహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సినిమాలో క్యారెక్ట‌ర్స్ అంతా త‌మ ఫ‌రిధిలో బాగానే న‌టించిన క‌థ‌ను న‌డిపించిన విధానం కాస్త లాగ్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్, ట్విస్టు బాగా డిజైన్ చేశారు. ఇక విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు మకరంద్ దేశ్‌పాండే మెప్పించాడు. అయితే ఈ ‘తిరగబడరసామీ’ (Tiragabadara Saami) సినిమాలో ఐటం సాంగ్‌, కొన్ని స‌న్నివేశాలు బొరింగ్ అనిపిస్తాయి. యాక్ష‌న్ సీన్స్ అల‌రిస్తాయి, రాజ్ త‌రుణ్ (Raj Tharun) అభిమానులు ఒక్క‌సారి ఈ సినిమాను చూడొచ్చు.

Raj Tharun

Updated Date - Sep 19 , 2024 | 04:57 PM