Purushothamudu: ఓటీటీకి వచ్చేస్తున్న.. రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’
ABN , Publish Date - Aug 27 , 2024 | 10:12 AM
ఈమధ్య నిత్యం వార్తలకు కేంద్రబిందువుగా ఉంటున్న నటుడు రాజ్ తరుణ్ నటించిన కొత్త చిత్రం పురుషోత్తముడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.
ఈమధ్య నిత్యం వార్తలకు కేంద్రబిందువుగా ఉంటున్న నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన కొత్త చిత్రం పురుషోత్తముడు (Purushothamudu) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకోలేక పోయింది. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ (Shree Sri Devi Productions) బ్యానర్ పై డా.రమేష్ తేజావత్ (Ramesh Tejawat), ప్రకాష్ తేజావత్ (Prakash Tejawat) ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ (Hasini Sudhir) హీరోయిన్ గా పరిచయమైంది. "ఆకతాయి", "హమ్ తుమ్" చిత్రాలతో పేరు తెచ్చుకున్న రామ్ భీమన ( Ram Bhimana) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి ఆగ్ర నటులు నటించడం విశేషం.
కథ వివిషయానికి వస్తే.. రచిత్ రామ్ (రాజ్‌తరుణ్) పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు. లండన్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని దేశానికి తిరిగిరాగా తమ కంపెనీ బాధ్యతలు అప్పగించాలని తండ్రి భావిస్తాడు. కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం 100రోజులు సామాన్యుడిలా జీవితం గడపితేనే సీఈవోగా అర్హత వస్తుందని పట్టుబడుతుంది. దీంతో రచిత్ రామ్ తన వివరాలు బయటకు రాకుండా ఉంచి ఓ పల్లెటూరికి వెళ్లి రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో హీరో జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, అమ్ముతో ప్రేమ ఎటు దారి తీసింది, ఊరి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే కథ చుట్టూ సినిమా నడుస్తుంది.
అయితే ఈచిత్రం కథనం మనం ఇప్పటికే చాలా చిత్రాల్లో చూసి ఉండడం, అక్కడక్కడ నెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమాలో చాలా పెద్ద నటులు ఉన్నప్పటికీ సమ్‌థింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. చివరలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ బావుంటుంది ఇప్పుడీ ఈ మూవీని ఆగస్టు29 గురువారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి ఈ సినిమాను చూడొచ్చు.