Radhaa Madhavam: ఓటీటీలోకి వచ్చేసిన ప్యూర్ కంటెంట్ మూవీ.. ఎందులో అంటే?

ABN , Publish Date - Jul 14 , 2024 | 05:03 PM

పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. అలాంటి ఒక కంటెంట్‌తో వచ్చిన సినిమా ‘రాధా మాధవం’. గోనాల వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, దాసరి ఇసాక్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల చెంతకు చేరింది.

Radhaa Madhavam Movie Stills

పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. అలాంటి ఒక కంటెంట్‌తో వచ్చిన సినిమా ‘రాధా మాధవం’ (Radhaa Madhavam). గోనాల వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, దాసరి ఇసాక్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల చెంతకు చేరింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాను కుటుంబమంతా కలిసి చూసే సన్నివేశాలతో దర్శకుడు తెరకెక్కించారు.

Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

‘రాధా మాధవం’ అనే టైటిలే ఓ ఫీల్ గుడ్ టైటిల్. కనుక కంటెంట్ కూడా అలాగే ఉండేలా.. ఎక్కడా అశ్లీలత చోటివ్వకుండా, కథాకథనాలలో కొత్తదనం నింపి దర్శకుడు సినిమాను నడిపిన విధానం ఓటీటీ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరి వాతావరణం వాటి అంశాలను పిరియాడిక్ స్టైల్‌లో ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. (Radhaa Madhavam in Amazon Prime)


Amazon-Prime.jpg

విలేజ్ లవ్ స్టోరీలు ఈ మధ్య ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి ఓ విలేజ్ లవ్ స్టోరీనే ‘రాధా మాధవం’. న్యాచురల్ లొకేషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరోహీరోయిన్లుగా నటించగా గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు అందించారు. మార్చి 1న ఈ సినిమా వన్ మీడియా ద్వారా థియేటర్స్‌లో విడుదలైంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందరికీ అందుబాటులో ఉంది. (Ragha Madhavam)

Read Latest Cinema News

Updated Date - Jul 14 , 2024 | 05:03 PM