The Goat Life OTT: మొత్తానికి ఓటీటీకి.. లేటెస్ట్ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్! ఎందులో, ఎప్పటి నుంచంటే?
ABN , Publish Date - Jul 14 , 2024 | 01:18 PM
2 నెలల క్రితం థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించి మలయాళీ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ డేట్, ఫ్లాట్ ఫాం ఖరారయ్యాయి.
రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన మలయాళీ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం‘ది గోట్ లైఫ్’ (The Goat Life) (ఆడు జీవితం) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ సమయం, ఫ్లాట్ ఫాం ఖరారయ్యాయి. మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఫృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత మలయాళ దర్శకుడు బ్లెస్సీ (Director Blessy) దర్శకత్వం వహించగా అమలాపాల్ ఓ పాత్రలో నటించింది. అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళ నుంచి గల్ఫ్ కు వలస వెళ్లిన బెన్యామిన్ నజీబ్ (Writer Benjamin Najib) అక్కడ తను ఎదుర్కొన్న అనుభవాలను, కష్టాలను, అక్కడి నుంచి ఎలా బయట పడింది తదితర రియల్ లైఫ్ ఘటనలను పుస్తకంగా తీసుకురాగా దాని ఆధారంగా చేసుకుని ఈ సర్వైవల్ డ్రామా సినిమాను తెరకెక్కించారు. 2008లో పట్టాలెక్కిన ఈ చిత్రం దాదాపు 16 ఏండ్ల పాటు షూటింగ్, ఇతర కార్యకలాపాలు పూర్తి చేసుకున్న ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) మూవీ 2024 మార్చి 28న విడుదలై అంతటా పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
కథ విషయానికి వస్తే.. నజీర్ బతుకుదెరువు కోసం ఓ ఏజెంట్ సాయంతో సౌదీకి వెళతాడు. అక్కడ చేయాల్సిన ఉద్యోగం ఏంటిది, ఎవరి దగ్గర చేయాలనే విషయం తెలియక ఎజెంట్ చెప్పాడని ఓ అరబ్ షేక్‌తో వెళ్లగా అతను ఏడారి మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ గోర్లకు కాపలాగా ఉంచుతాడు. నజీర్ అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించినా అరబ్ షేక్ ఒప్పుకోక పోగా దాడి చేస్తాడు. దీంతో పక్కన మాట్లాడడానికి పక్కన మనిషి లేక, అక్కడి నుంచి ఎలా బయట పడాలో తెలియక అక్కడే చిక్కుకుపోతాడు. చివరకు తన రూపు పూర్తిగా మారి పోయి, మాటలు కూడా మాట్లాడలేని స్థితికి వస్తాడు.
అయితే కొన్నేండ్ల తర్వాత నజీర్ లాగే ఎడారిలో చిక్కుకున్న తన మిత్రుడు కలిసి ఇక్కడి నుంచి పారి పోవడానికి మార్గం తెలిసిన ఓ ఆఫ్రికన్ ఉన్నాడని మనకు సాయం చేస్తాడని చెప్తాడు. దీంతో అ ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వారు అ ఎండను తట్టుకుంటూ దట్టమైన ఎడారిలో ఎలా ప్రయాణం సాగించారు, తిండి, నీటి కోసం ఏం చేశారనేదే పాయింట్. ఆ సమయంలో వారి మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, చివరకు ముగ్గురు బయట పడగలిగారా, లేదా ఆ తర్వాత షేక్ మళ్లీ ఎలా ఎదురయ్యాడు, నజీర్ ఇండియా చేరుకున్నాడా లేదా అనే థ్రిల్లింగ్ కథ కథనాలతో సినిమా సాగుతుంది.
ఇప్పుడు ఈ సినిమా మూడు నెలల తర్వాత డిజిటల్ విడుదలకు రెడీ అయింది. ముందు నుంచి ఈ చిత్రాన్ని మే 26 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ (Disny Plus Hotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరిగినా అవన్నీ ఉత్తవే అయ్యి ఎప్పటికప్పుడు వాయుదా పడుతూ వచ్చింది. తాజాగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.
జూలై 19 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్లు, మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఇష్టపడే వారు, థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేయండి. డోంట్ మిస్. అయితే సినిమా ప్రధమార్థంలో ఒకటి రెండు ముద్దులు, రోమాన్స్ సన్నివేశాలను స్కిప్ చేస్తే చాలు మిగతా సినిమా అంతటిని ఫ్యామిలీతో చూసేయవచ్చు.