Hanuman Ott: ఉన్నఫలంగా ఓటీటీలోకి వచ్చిన హనుమాన్.. ప్రశాంత్ వర్మ తెలివికి మొక్కాల్సిందే!

ABN , Publish Date - Mar 17 , 2024 | 12:15 PM

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘హనుమాన్’ ఎట్టకేలకు ఉన్నఫలంగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీని వెనకాల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఉపయోగించిన బిజినెస్ తెలివితేటలను అంతా మెచ్చుకుంటున్నారు.

Hanuman Ott: ఉన్నఫలంగా ఓటీటీలోకి  వచ్చిన హనుమాన్.. ప్రశాంత్ వర్మ తెలివికి మొక్కాల్సిందే!
HANUMAN

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ‘హనుమాన్’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. (Hanuman). ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లూ రాబట్టిన ఈ చిత్రం ఈ మధ్యే 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనితో పాటే విడుదలైన సైంథవ్, గుంటూరు కారం, నా సామారంగా చిత్రాలు అల్రేడీ డిజిటల్ స్ట్రీమింగ్ (OTT Streaming) కు వచ్చేయగా ఈ హనుమాన్ (Hanuman) మాత్రం ఇంకా ఓటీటీలోకి రాలేదు. గడిచిన నెల రోజుల నుంచి డేట్స్ ప్రకటిస్తూ వచ్చినా వాయిదాల మీద వాయుదాలు పడుతూ వచ్చి సంగతి తెలిసిందే.

Hanuman-OTT.jpg

హనుమాన్ టీం ముందుగా ప్రకటించిన ప్రకారం మార్చి 8న ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ఇక్కడా తమ బిజినెస్ స్ట్రాటజీనీ బాగా ఫాలో అయినట్లు తెలుస్తోంది. చెప్పిన ప్రకారం ఓటీటీలోకి తీసుకురాకుండా జీ సినిమా, సినీ ఫ్లెక్స్ సంస్థలతో ఎక్కువ మొత్తానికి మాట్లాడుకుని మంచిగానే క్యాష్ చేసుకున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి.

ఈ క్రమంలోనే హనుమాన్ (Hanuman) సినిమా హిందీ వెర్షన్ ను ఫస్ట్ టైమ్ జీ సినిమా ఓటీటీలోకి తీసుకు రావడమే కాక, సినీ ఫ్లెక్స్ శాటిలైట్ ఛానల్లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా శనివారం(16.03.2024) నాడు హిందీ భాషలో టెలికాస్ట్ చేశారు. దీంతో మిలియన్లలోనే పబ్లిక్ హనుమాన్ (Hanuman) సినిమాను చూసినట్లు తెలుస్తోంది. ఆ సంస్థలకు కూడా యాడ్స్ రూపంలో రెండింతలు లాభం వచ్చినట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి.


అనంతరం మరుసటి రోజు ఆదివారం (17.03.2024) నాడు ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండానే ఉన్నఫలంగా హనుమాన్ (Hanuman) చిత్రాన్ని ఓటీటీ జీ5 (Zee5)లో అన్ని భాషలలో స్ట్రీమింగ్ (OTT Streaming) కు తీసుకు వచ్చారు. దీంతో అభిమానులు ఆలస్యంగానైనా సినిమాను విడుదల చేసినందకు సంతోషిస్తూనే మేకర్స్ బిజినెస్ తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. ఇది ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఐడియా అయి ఉంటుందంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం హనుమాన్ (Hanuman) చిత్రాన్ని ఇప్పుడే చూసేయండి మరి.

Updated Date - Mar 17 , 2024 | 12:18 PM