Kalki 2898AD OTT: ఓటీటీకి వ‌చ్చేసిన పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. పండ‌గే పండ‌గ‌

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:24 PM

రెండు రాష్టాల తెలుగు ప్ర‌జ‌లు ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన‌ ‘కల్కి 2898AD’ చిత్రం ఓటీటీకి వచ్చేసింది.

kalki

రెండు రాష్టాల తెలుగు ప్ర‌జ‌లు ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. రెండు నెల‌ల క్రితం పాన్ ఇండియాగా థియేట‌ర్ల‌లో విడుద‌లై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన‌ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘కల్కి 2898AD’ (Kalki 2898AD) చిత్రం మొత్తానికి ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 27న థియేటర్లలలోకి వచ్చిన ఈ సినిమా కేవలం కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ. 1002 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా చ‌రిత్ర‌లో వెయ్యి కోట్లు ఆర్జించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ‘కల్కి 2898AD’ మూవీ నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ అంత‌కుమించి అనే స్థాయిలో కనీవినీ ఎరుగని రికార్డ్‌ని క్రియేట్ చేసింది.

Kalki-2898AD-OTT.jpg

కథ విషయానికి వస్తే.. మహాభారత యుద్ధం ముగింపు దశతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని చంపడానికి అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) ప్రయత్నం చేయ‌డం, శ్రీకృష్ణుడు ఆగ్ర‌హించి ఒంటి నిండ గాయాల‌తో మ‌ర‌ణం లేకుండా జీవించాలని అశ్వద్ధామకి శాపం ఇస్తాడు. ఆపై పశ్చాత్తాపం పొందిన అశ్వద్ధామకి కలియుగంలో మళ్ళీ కల్కిగా అవతరించబోతున్నానని, ఆ శిశువుని నువ్వే కాపాడాల్సి ఉంటుంద‌ని అదేశిస్తాడు.


ఇక త‌ర్వాత క‌థ‌ కలియుగానికి షిప్ట్ అవుతుంది. సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) ఓ కాంప్లెక్స్‌కి అధిపతి. తన కాంప్లెక్స్‌లో ఫెర్టిలిటీ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తూ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటాడు.ఈ క్ర‌మంలో సుమతి (దీపికా పదుకోనే) ఆ ల్యాబ్ నుంచి త‌ప్పించుకోవ‌డం సుమతిని కాపాడుతూ అశ్వద్ధామ, అమెను ప‌ట్టుకోని కాంప్లెక్స్‌కు అప్ప‌జెప్పాల‌ని భైర‌వ (ప్ర‌భాస్‌) ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. చివ‌ర‌కు భైర‌వ సుమ‌తిని యాస్కిన్ అప్ప‌గించాడా, అశ్వద్ధామ ఎలా పోరాటం చేశాడ‌నే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

Kalki-Prabhas.jpg

అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో, హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌ (NetFlix)లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ మూవీని మిస్ చేయ‌కుండా ఇంట్లోనే కుటుంబంతో క‌లిసి మ‌ళ్లీ మ‌ళ్లీ చూసి ఆస్వాదించండి.

Updated Date - Aug 22 , 2024 | 03:24 PM