Godzilla Minus One: బాబులకే బాబు ఈ గాడ్జిల్లా! సడెన్‌గా ఓటీటీకి వచ్చి.. షాకిచ్చిన ఆస్కార్ విజువల్ వండర్
ABN , Publish Date - Jun 01 , 2024 | 11:00 AM
ఓటీటీ ప్రేక్షకులను అశ్చర్యపరుస్తూ ఓ పెద్ద సినిమా సర్ఫ్రైజింగ్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సైతం దక్కించుకున్న ఈ చిత్రం ఈ వారం సినిమా లవర్స్‌కు బెస్ట్ ఆప్సన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓటీటీ ప్రేక్షకులను అశ్చర్యపరుస్తూ ఓ పెద్ద సినిమా సర్ఫ్రైజింగ్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సైతం దక్కించుకున్న ఈ చిత్రం ఈ వారం సినిమా లవర్స్‌కు బెస్ట్ ఆప్సన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమానే గాడ్జిల్లా మైనస్ వన్ (Godzilla Minus One). జపాన్‌కు చెందిన ఈ సినిమా 2023 ఆక్టోబర్‌లో థియేటర్లలోకి రాగా అక్కడ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఇతర దేశాల్లోను విడుదలై రికార్డులు తిరగరాసింది. కేవలం 12 మిలియన్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల కలెక్షన్లు సాధించిందంటే సినిమా ఏ రేంజ్‌లో నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రపంచమంతా సంచలనాలు సృష్టించిన ఈ సినిమా మన ఇండియాలో థియేటర్లలో విడుదల కాకపోవడం గమనార్హం.
గాడ్జిల్లా ఫ్రాంఛైజీలో 37వ చిత్రంగా జపాన్ జానపద ఇలతిహాసాలను, నవలల అధారంగా చేసుకుని తకాషి యమజాకి ఈ గాడ్జిల్లా మైనస్ వన్ (Godzilla Minus One) చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాదు రచన, విజువల్ ఎఫెక్ట్స్ అందించడం విశేషం. 1945 రెండో ప్రపంచ యుద్దం ముగింపు సమయాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఓ వైపు వరల్డ్ వార్ 2 భీకరంగా జరుగుతుండగానే కోయిచి షికిషిమా అనే ఫైలట్ మధ్యలోనే తన యుద్ద విమానంతో వచ్చి జపాన్ సమీపంలోని ఓ సముద్రపు ఓడ్డున ఉన్న బేస్ క్యాంప్‌లో ల్యాండ్ అవుతాడు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా సముద్రంలోంచి వచ్చిన గాడ్జిల్లా క్యాంపుపై దాడి చేస్తుంది. షికిషిమా దానిపై తిరిగి దాడి చేయాలని ప్రయత్నించి విఫలమవుతాడు. చివరకు గాడ్జిల్లా దాడిలో తాచిబానా, షికిషిమా ఇద్దరు మాత్రమే బతికి బయటపడతారు.
ఇక ఆ తర్వాత షికిషిమా టోక్యోలోని తన ఇంటికి తిరిగి వెళ్లగా అప్పటికే జరిగిన బాంబు దాడిలో తల్లిదండ్రులు చనిపోయారని తెలుసుకుంటాడు. తర్వాత తనలాగే తల్లిదండ్రులను కోల్పోయిన నోరికో ఓషి అనే మహిళ, అకికో అనే అనాథ పాపతో కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఆపై నావికాదళంలో మందు పాతరలను పారవేసే (మైన్ స్వీపర్) ఉద్యోగం సంపాదిస్తాడు. ఈక్రమంలో అమెరికా జపాన్‌పై అణుబాంబులు ప్రయోగించడంతో దాని నుంచి వచ్చిన న్యూక్లియర్ పదార్దాలతో సముద్రంలో ఉన్న గాడ్జిల్లా బలపడుతుంది. ఎన్ని తీవ్ర గాయాలైనా తిరిగి సరికొత్తగా శక్తిని, బలాన్ని తెచ్చుకుంటూ మరణం లేని దానిలా తయారవుతుంది. అంతేగాక సముద్రంలో ఓడలపై, నగరాలపై దాడి చేస్తూ నానా భీబత్సం సృష్టిస్తుంటుంది. ఈక్రమంలో హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు, ఇంతకు చివరకు అది మరణించిందా అనే కథకథనాలతో సినిమా సాగుతూ సీట్ ఎడ్జ్ థ్రిల్ అనుభూతిని అందజేస్తుంది.
సినిమా మొదట్లో కాస్తా స్లోగా మొదలైనా.. రాను రాను గ్రిప్పింగ్ మారుతుంది. ఇక ఆ తర్వాత గాడ్జిల్లా ఎంట్రీతో సినిమా అసాంతం స్పీడందుకుంటూ మనల్ని దాని వెంట తిరిగేలా చేస్తుంది. ముఖ్యంగా గాడ్జిల్లా చచ్చిందని అనుకునే లోపు తిరిగి కొత్త శక్తితో బతికి రావడం, రెట్టింపు దాడి చేసే విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇక క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్టైతే మాములుగా ఉండదు. దీనమ్మా ఇదెక్కడి గాడ్జిల్లా రా నాయనా.. ఇది బాబులకే బాబులా ఉంది అని మనం అనుకోవడమైతే ఖాయం. ఇప్పుడీ సినిమా (Godzilla Minus One) ఉన్నట్టుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌కు రాగా జపనీస్, ఇంగ్లీష్, హిందీ , తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరి కొద్ది రోజుల్లో తెలుగులోనూ తీసుకు వచ్చే అవకాశం ఉంది. సో సినీ లవర్స్ ఈ వారాంతంలో ఈ సినిమాను చూడడం ఎట్టి పరిస్థితుల్లో చూడడం మిస్సవకండి.