Nindha: ‘నింద’కు ఆ నింద తొలగింది..

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:46 PM

వరుణ్ సందేశ్ నటించిన ‘నింద’ చిత్రం థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఓటీటీలోనూ ఈ సినిమా దూసుకెళుతోంది. అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్‌కు కొన్ని అవాంతరాలు ఏర్పడటంతో.. వాటిని ఈ సినిమా అధిగమించింది. వివరాల్లోకి వెళితే..

Nindha Movie Poster

వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘నింద’ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ఇప్పుడు ఎమిరేట్స్, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రసారం కావడానికి ఆమోదాన్ని రాబట్టుకుంది. దీంతో అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ సినిమా చేరబోతోంది. సెప్టెంబర్ 6న ఈటీవీ విన్‌లో విడుదలైనప్పటి నుంచీ ట్రెండ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే 35 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను అంతర్జాతీయ సర్కిల్స్‌లో స్ట్రీమింగ్ ఆపేశారు. ఇప్పుడు నింద నుండి ఈ ‘నింద’ బయటపడి.. స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.


వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా.. వరుణ్ సందేశ్‌ నటనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వుండే ఈ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి స్పందనను రాబట్టుకోవడం సంతోషాన్నిచ్చిందని ఇటీవల దర్శకనిర్మాత రాజేష్ జగన్నాధం తెలిపారు. అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై వంటివారు ఇందులో ఇతర ముఖ్య తారాగణంగా నటించారు. సినిమాటోగ్రాఫర్ రమీజ్ నవీత్ అద్భుతమైన విజువల్స్, సంతు ఓంకార్ హాంటింగ్ స్కోర్, అనిల్ కుమార్ చేసిన ఎడిటింగ్‌.. ‘నింద’ సినిమాకు హైలెట్స్. ఇప్పుడు అంతర్జాతీయ స్ట్రీమింగ్ ఆమోదం లభించడంతో ఈ ‘నింద’ సినిమా నెక్స్ట్ లెవెల్‌కి చేరుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్


‘నింద’ కథ విషయానికి వస్తే.. కాండ్రకోట అనే ఊరిలో మంజు అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య బాలరాజు (ఛత్రపతి శేఖర్‌) చేశాడని కోర్ట్‌లో రుజువు కావడంతో జడ్జ్ సత్యానంద్‌ (తనికెళ్ల భరణి) ఇష్టం లేకపోయినా ఉరిశిక్ష విధిస్తాడు. నిజంగా ఆ హత్య బాలరాజే చేశాడా? అసలు సత్యానంద్‌ ఎందుకు తీర్పు ఇస్తూ ఫీల్ అయ్యాడు? బాలరాజుకు, ఆ హత్యకు సంబంధం లేదని సత్యానంద్ ఎలా నమ్మాడు? చనిపోయిన సత్యానంద్‌ కోసం అతని కొడుకు వివేక్‌ (వరుణ్‌ సందేశ్‌) ఏం చేశాడు? ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? తెలియాలంటే ‘నింద’ సినిమా చూడాల్సిందే.

Also Read-Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2024 | 03:46 PM