Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల

ABN , Publish Date - Jan 15 , 2024 | 07:13 PM

మకర సంక్రాంతి శుభ సందర్భంగా 2024లో తమ ఎక్సయిటింగ్ తెలుగు మూవీస్ లైనప్‌ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ సంవత్సరం థియేట్రికల్ విడుదల తర్వాత, 12 తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతాయని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాలు ఈ సంవత్సరం థియేట్రికల్ ప్రదర్శన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటాయి.

Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల
Pushpa 2, Devara and VD12 Posters

మకర సంక్రాంతి శుభ సందర్భంగా 2024లో తమ ఎక్సయిటింగ్ తెలుగు మూవీస్ లైనప్‌ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ సంవత్సరం థియేట్రికల్ విడుదల తర్వాత, 12 తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతాయని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్, 2024 కోసం లైసెన్స్ పొందిన తెలుగు కంటెంట్ ఆఫరింగ్‌లో భాగంగా ఈ చిత్రాల పేర్లను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాలు ఈ సంవత్సరం థియేట్రికల్ ప్రదర్శన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటాయి. అభిమాన నటుల పెర్ఫార్మెన్స్ మ్యాజిక్‌ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇళ్లలో ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌.

Netflix-Pandaga.jpg

నెట్‌ఫ్లిక్స్ వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 12 టైటిల్స్ యొక్క స్నీక్ పీక్‌తో అభిమానులను అలరించి ప్రేక్షకులలో ఎక్సయిట్‌మెంట్‌ని పెంచింది. 2023లో భోళా శంకర్, దసరా, బ్రో, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, మ్యాడ్, ఖుషి వంటి చిత్రాలను ఆస్వాదించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులు.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ 2024లో అందించే చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ఆ 12 చిత్రాలు ఏమిటంటే..

అల్లు అర్జున్ ‘పుష్ప 2’

జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’

ప్రభాస్ ‘సలార్‌’

బాలకృష్ణ NBK109,

విజయ్ దేవరకొండ VD12

అల్లు శిరీష్ ‘బడ్డీ’

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,

వైర ఎంటర్‌టైన్‌మెంట్ -హాయ్ నాన్న,

కార్తికేయ, యువీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.12,

GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం 9,

సిద్ధు జొన్నలగడ్డ SVCC37,

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్-టిల్లు స్క్వేర్ వంటి ఎక్జయిటింగ్ చిత్రాలు 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అలరించబోతున్నాయి.


Salaar.jpg

ఈ అప్‌కమింగ్ లైనప్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా విపి - కంటెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. “నెట్‌ఫ్లిక్స్ సౌత్ కంటెంట్ వ్యూస్‌లో 50 శాతం YoY గ్రోత్ మా తెలుగు సినిమా స్ట్రాంగ్ అప్పీల్ ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం లైనప్, అత్యుత్తమ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలతో, ఇండస్ట్రీ బిగ్ స్టార్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అత్యుత్తమ తెలుగు చిత్రాలని అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం

************************

*Vijay Binni: ‘నా సామిరంగ’ రిజల్ట్‌పై దర్శకుడి రియాక్షన్ ఇదే..

***************************

*Teja Sajja: ‘హను-మాన్’ విడుదల తర్వాత మెగాస్టార్ ఏమని మెసేజ్ చేశారంటే..

***************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్

**************************

Updated Date - Jan 15 , 2024 | 07:22 PM