Big Boss 8 Today: నయని అవుట్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
ABN , Publish Date - Nov 04 , 2024 | 09:20 AM
హౌస్‌లోకి ఎంటర్ అయినా మొదట్లో తన ఆటతీరు, మాట తీరుతో అందరిని ఆకర్షించిన నయని తర్వాత ప్రతి చిన్న దానికి ఏడుస్తూ ఆటపై ఫోకస్ కోల్పోయి, క్రై బేబి ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఇక హౌస్‌లో నాలుగు వారాలు గడిపిన నయని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ నయని రెమ్యూనరేషన్ ఎంతంటే..
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం జరిగిన ఎలిమినేషన్స్‌లో నయని పావని ఎలిమినేట్ అయ్యింది. అందరు ఊహించినట్లుగానే నయని ఎలిమినేట్ కావడంతో ఈ వీక్ ఎవరు సర్ప్రైజ్ కాలేదు. హౌస్‌లోకి ఎంటర్ అయినా మొదట్లో తన ఆటతీరు, మాట తీరుతో అందరిని ఆకర్షించిన నయని తర్వాత ప్రతి చిన్న దానికి ఏడుస్తూ ఆటపై ఫోకస్ కోల్పోయి, క్రై బేబి ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఇక హౌస్‌లో నాలుగు వారాలు గడిపిన నయని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ నయని రెమ్యూనరేషన్ ఎంతంటే..
బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభమై తొమ్మిది వారాలు గడవగా 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, నైనిక, కిర్రాక్ సీత, మణికంఠ, మెహబూబ్ తాజాగా నయని ఎలిమినేట్ అయ్యారు. ఇది పక్కన పెడితే 4 వారాలు బిగ్ హౌస్‌లో గడిపిన నయని రోజుకి దాదాపు రూ. 22,000 వేలు ఛార్జ్ చేశారు. ఇక వారానికి దాదాపు రూ. 1,50,000. సో, మొత్తం నాలుగు వారాలకి దాదాపుగా రూ. 6 లక్షల రెమ్యూనరేషన్‌ని అందుకుంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి ఎంటర్ అయినా నయని.. గత సీజన్‌లో ఎలిమినేట్ అయినప్పుడు ఎంతగా ఏడ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీజన్ కూడా క్రై బేబి ట్యాగ్‌ని సొంతం చేసుకున్న.. ఎలిమినేషన్స్‌లో మాత్రం ఏడవలేదు. బయిటికొచ్చాక హౌస్‌లో డమ్మీ ప్లేయర్స్ ఎవరెవరు అంటూ నాగార్జున అడిగాడు. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియ పేర్లను చెప్పింది నయని. ఇక టాప్ 3 బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అని అడగగా హరితేజ, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పేసి హౌస్‌కి బై బై చెప్పింది.