Love Mouli: ఓటీటీకి.. లేటెస్ట్ తెలుగు బోల్డ్ మూవీ! ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - Jun 23 , 2024 | 08:21 PM

తెలుగు డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు లేటెస్ట్ టాలీవుడ్ బోల్డ్‌ మూవీ రెడీ అయింది. చాలా కాలం త‌ర్వాత న‌వ‌దీప్ హీరోగా న‌టించిన ల‌వ్‌మౌళి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది.

Love Mouli: ఓటీటీకి.. లేటెస్ట్ తెలుగు బోల్డ్ మూవీ! ఎప్ప‌టినుంచంటే?
lovemouli

తెలుగు డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు లేటెస్ట్ టాలీవుడ్ బోల్డ్‌ మూవీ రెడీ అయింది. చాలా కాలం త‌ర్వాత న‌వ‌దీప్ (Navdeep) హీరోగా న‌టించిన ల‌వ్‌మౌళి (Love Mouli) ఇటీవ‌లే జూన్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకుంది. పంఖురి గిద్వాని, భావ‌న సాగి, మిర్చి హేమంత్‌, మిర్చి కిర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సీ స్పేస్‌, నైరా క్రియేష‌న్స్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ నిర్మించాయి.

lovemoulicertifiedA.jpg


థియేట‌ర్ల‌లో విడుద‌లైన స‌రిగ్గా 20 రోజుల‌కు ల‌వ్‌మౌళి (Love Mouli) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ప్ర‌ముఖ తెలుగు డిజిట‌ల్ ఫ్లాట్ ఫాం ఆహా (aha videoin)లో ఈ నెల (జూన్ 27) నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిజ‌మైన ప్రేమ కోసం త‌పించే పాత్ర‌లో న‌వ‌దీప్ (Navdeep) బాగా ఆక‌ట్టుకున్నాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో న‌డిపించాడు. ఇంత‌వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో వ‌చ్చిన ఈ సినిమా నేటి జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. కొన్ని స‌న్నివేశాలు ప‌చ్చిగా చూయించ‌డంతో ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో క‌లిసి చూడ‌డం క‌ష్టం.

Updated Date - Jun 23 , 2024 | 08:21 PM