Love Mouli: ఓటీటీకి వ‌చ్చేసిన న‌వ‌దీప్ బోల్డ్ అండ్ రొమాంటిక్‌ మూవీ

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:44 PM

డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు న‌వ‌దీప్ హీరోగా న‌టించిన లేటెస్ట్ బోల్డ్‌ మూవీ ల‌వ్‌మౌళి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Love Mouli: ఓటీటీకి వ‌చ్చేసిన న‌వ‌దీప్ బోల్డ్ అండ్ రొమాంటిక్‌ మూవీ
love mouli

టాలీవుడ్ బ్ర‌హ్మ‌చారి న‌వ‌దీప్ (Navdeep) చాలాకాలం త‌ర్వాత సోలో హీరోగా న‌టించిన బోల్డ్‌ చిత్రం ల‌వ్‌మౌళి (Love Mouli) డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు వ‌చ్చేసింది. ఇటీవ‌లే జూన్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిశ్ర‌మ స్పంద‌న‌ను తెచ్చుకుంది. పంఖురి గిద్వాని, భావ‌న సాగి, మిర్చి హేమంత్‌, మిర్చి కిర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సీ స్పేస్‌, నైరా క్రియేష‌న్స్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ నిర్మించాయి.

navdeeplovemouli1.jpg

అయితే.. థియేట‌ర్ల‌లో విడుద‌లైన స‌రిగ్గా 20 రోజుల‌కు ఈ ల‌వ్‌మౌళి (Love Mouli) సినిమా ఓటీటీకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ తెలుగు డిజిట‌ల్ ఫ్లాట్ ఫాం ఆహా (aha videoin)లో ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. నిజ‌మైన ప్రేమ కోసం త‌పించే పాత్ర‌లో న‌వ‌దీప్ (Navdeep) బాగా ఆక‌ట్టుకున్నాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో న‌డిపించాడు.


lovemoulicertifiedA.jpg

ఇంత‌వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో వ‌చ్చిన ఈ సినిమా నేటి జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. రోమాంటిక్ స‌న్నివేశాలు,ముద్దులు బాగానే ఉండ‌డంతో పాటు ఓ సీన్‌లో క‌థానాయిక‌ను యానిమ‌ల్ సినిమాలో త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని చూయించిన స్టైల్‌లో ఇందులోనూ ప‌దే ప‌దే ఆ త‌ర‌హా ప్ర‌యోగం చేశారు. సో ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో క‌లిసి చూడ‌డం క‌ష్టం.

Updated Date - Jun 28 , 2024 | 12:44 PM