Prathinidi2 OTT: నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చిన.. నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ సీక్వెల్
ABN , Publish Date - Sep 27 , 2024 | 07:11 AM
సుమారు ఐదారేండ్ల విరామం తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం ప్రతినిధి2 . మే10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది.
సుమారు ఐదారేండ్ల విరామం తర్వాత నారా రోహిత్ (Nara Rohit) నటించిన చిత్రం ప్రతినిధి2 (Prathinidi2). ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రముఖ జర్నలిస్టు మూర్తి దర్శకుడిగా మరి తెరకెక్కించిన ఈ సినిమాలో సిరి, సచిన్ ఖేడేకర్, జిష్ణు సేన్ గుప్తా, ఇంద్రజ,తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్ట్ చేతన్ (నారా రోహిత్). తనలాగే సమాజంపై బాధ్యతతో ఉన్న ఉదయభాను న్యూస్ ఛానల్‌కు సీఈవోగా కొత్త బాధ్యతలు తీసుకుని తన సంచలనాత్మక కథనాలతో అన్ని వర్గాల్లో వణుకు పుట్టిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ బాంబ్‌బ్లాస్ట్‌లో రెండో పర్యాయం కూడా సీఎంగా అధికారంలో ఉన్న ప్రజాపతి చనిపోతాడు. ఆపై చేతన్ ఈ పని చేశాడంటూ పోలీసులు అరెస్టు చేస్తారు. ఈ నేపథ్యంలో చేతన్‌కు సీఎంకు మధ్య ఉన్న లింక్ ఏంటి, అ సలు సీఎంను ఎవరు హత్య చేశారు,ఎందుకు చేయించారు, ఈ కేసును నుంచి హీరో ఎలా బయటకు వచ్చాడనే కథకథనాలతో సినిమా సాగుతుంది.
ఇ్పపుడీ సినిమా ఈ రోజు (శుక్రవారం)నుంచి ఆహా (aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. టీజర్, ట్రైలర్‌లతోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ కొన్నాళ్లు చర్చల్లో బాగా నిలిచింది. అయితే సీఎం మరణం.. అతని కొడుకుని సీఎం చేయాలని పట్టుబట్టడం.. సంక్షేమ పథకాలపై సెటర్లు.. అభివృద్ధి జరగలేదనే విమర్శలు.. ఇవన్నీ అధికార వైసీపీ పార్టీకి కనెక్ట్ అయ్యే అంశాలుగా ఉన్నా.. కథ పరంగా ఆ పార్టీని కెలికే ప్రయత్నం అయితే చేయలేదు. కేవలం సీఎం మర్డర్ మిస్టరీ చుట్టూ పొలిటికల్ డ్రామా మాత్రమే చూపించారు. అక్కడక్కడా పొలిటికల్ సెటైర్లు వేయించినా.. సెన్సార్ బీప్‌లు చాలా చోట్ల కనిపించాయి.ఈ సినిమా చాలా వరకూ టీవీ డిస్కషన్స్ బ్రేకింగ్ న్యూస్‌ల చుట్టూ తిరగడంతో.. చాలామందికి బోరింగ్ అనిపించే అవకాశం ఉంది. ఎక్కువగా సీన్లు వాస్తవ దూరంగా కూడా అనిపిస్తాయి.