Saripodhaa Sanivaaram OTT: నానికి స‌రిపోలేదంటా.. ఓటీటీకి వ‌చ్చేస్తున్నాడు! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - Sep 22 , 2024 | 08:49 AM

ఈ సారి ఓటీటీకి పండ‌గ వాతావ‌ర‌ణం వారం ముందుగానే రానుంది. ఇటీవ‌ల నాని న‌టించిన ఫ్యామిలీ, యాక్ష‌న్ చిత్రం స‌రిపోదా శ‌నివారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

saripoda sanivaram

ఈ సారి పండ‌గ వాతావ‌ర‌ణం వారం ముందుగానే ఓటీటీకి రానుంది. ఇటీవ‌ల నాని (Nani) న‌టించ‌గా రూ.100 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించిన ఫ్యామిలీ, యాక్ష‌న్ చిత్రం స‌రిపోదా శ‌నివారం (Saripodhaa Sanivaaram) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఆగ‌స్టు 29న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌న‌ను ద‌క్కించుకుంది. నానికి హ్యాట్రిక్ విజ‌యాన్ని అందించింది. RRR వంటి భారీ చిత్రాన్ని అందించ‌డంతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓజీ సినిమాను రూపొందిస్తున్న‌ డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మించ‌గా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్జే సూర్య (SJ Suryah), ప్రియాంకా మోహ‌న్ (Priyanka Mohan), హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, సాయి కుమార్‌, అభిరామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

GXh8fr-XMAA-15q.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. త‌న కళ్లేదుట చిన్న చెడు ఘ‌ట‌న జ‌రిగినా తీవ్ర ఆవేశంతో,కోపంతో ర‌గిలిపోతూ ఎదుటి వారు ఎంత‌టి వారైనా స‌రే వెళ్లి వారిపై దాడి చేస్తుంటాడు సూర్య‌. అయితే ఆ కోపం ఎల్ల‌వేళ‌లా ప‌నికిరాద‌ని దానికంటూ విలువ ఉండాల‌ని త‌న త‌ల్లి చివ‌ర‌గా చెప్పిన మాట మేర‌కు కేవ‌లం శ‌నివారం మాత్ర‌మే త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ అందుకు కార‌ణ‌మైన వారిని దండిస్తుంటాడు. మ‌రోవైపు సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) త‌న అన్న వ‌ళ్ల ఇబ్బంది ప‌డుతూ.. ఆ కోపాన్ని స‌మీపంలోని సోకుల‌పాలెంలోని వారిపై చూపిస్తూ అక్క‌డి వారికి న‌ర‌కం చూపిస్తుంటాడు. ఈ క్ర‌మంలో సీఐ ప‌ని చేసే స్టేస్ట‌ష‌న్‌కు కొత్త‌గా వ‌చ్చిన కానిస్టేబుల్ చారుల‌త వ‌ళ్ల సూర్య‌కు ఈ సోకుల పాలెం విష‌యం తెలుస్తుంది.

GX-LDpjWgAAO4sw.jpeg

ఆపై సీఐని ఎదుర్కోవ‌డానికి సూర్య‌ ఏం చేశాడు, సైకో మ‌న‌స్త‌త్వం ఉన్న‌ ద‌యానంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు, అసలు సోకులపాలెంకు ఉన్న స‌మ‌స్య‌ ఏమిటి? ఆ సోకులపాలెంపై దయానంద్ పగబట్టడానికి కారణమేంటి? చివరికి ఎలా సాల్వ్ చేశారు? చారులత‌కు, సూర్యకు ఉన్న బంధమేంటి? అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన హాస్యాన్ని, మ‌ద‌ర్ సెంటిమెంట్‌, అదిరిపోయే పోరాట స‌న్నివేశాలు ఇలా అన్ని ర‌కాల ఎమోష‌న్స్, థ్రిల్‌ను ఇస్తుంది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. సో.. ఎవ‌రైతే థియేట‌ర్లలో మిస్స‌య్యారో, సినిమాను మ‌ళ్లీ చూడాల‌నుకుంటున్నారో ఈ గురువారం నుంచి మిస్స‌వ్వ‌కుండా చూసేయండి.

Updated Date - Sep 22 , 2024 | 08:49 AM