Katha Venuka Katha: కథకన్నా ట్విస్టులే ఎక్కువున్నయ్.. ఇదేం సినిమారా నాయన
ABN , Publish Date - Apr 12 , 2024 | 04:06 PM
మాములుగా మన టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలన్నీ దాదాపుగా రొటీన్ స్టోరీలతోనే వచ్చి పోతుంటాయి.
ఎప్పుడో అమాస పున్నానికోసారి బుజ్జి ఇలా రా, గామి వంటి కాన్సెప్ట్‌లో ఒరకటి అరా ఇంట్రెస్టింగ్ సినిమాలు అలా వచ్చి ఇలా పోతుంటాయి. వీటిలోను ఫలానా సినిమా బావుందనకునే సినిమా అసలు ఎప్పుడు థియేటర్లకు వచ్చి పోయిందనే విషయం ఇవ్వాలా రేపు చాలా మందికి తెలియదు. అలాంటి కోవకు చెందినదే ఇప్పుడు మనం మాట్లాడుకోబేయే చిత్రం కథ వెనక కథ (KathaVenukaKatha). ఇప్పుడు ఈ సినిమా ఈ టీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుటోంది.
కేరింత,మనమంతా చిత్రాల ద్వరా గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ (Viswant Duddumpudi) కథానాయకుడిగా సునీల్ (Suneel), జయప్రకాశ్, సత్యం రాజేశ్, రఘుబాబు వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించగా కృస్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం వచ్చి పోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు.
ఇదిలాఉండగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో చాలా మంది దృష్టి ఈ చిత్రంపై పడింది. మాములుగా మన సినిమాల్లో చిన్న కథ ఉండి, ఒకటి రెండు ట్విస్టులుంటే పదే పదే చెప్పుకుంటాం కానీ ఈ సినిమాలో వచ్చే ట్విస్టులతో మన ఫీజులు ఎగరడం ఖాయం అనేలా ఒకదాని తర్వాత మరోటి రివీల్ అవుతూ ఇదెక్కడి సినిమారా నాయనా అని చూసే ప్రేక్షకులతో అనిపించక మానదు.
ఇక కథ విషమానికి వస్తే.. సిటీలో వరుసగా మహిళల మానభంగం, హత్యలు జరుగుతుంటాయి దీంతో కేసును సత్య (సునీల్) అనే పోలీస్ అధికారికి అప్పగిస్తారు. అదే సమయంలో అశ్విన్(విశ్వంత్)కు చిన్నప్పటి నుంచి దర్శకుడిని కావాలనే కోరిక ఉంటుంది. అంతేగాక దర్శకుడిగా నిరూపించుకుని వస్తేనే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా అని మామయ్య చెప్పడంతో తానేంటో నిరూపించుకోవడానికి అశ్విన్ నగరానికి వచ్చి కృష్ణ (జయప్రకాశ్) అనే నిర్మాత సహకారంతో సినిమా మొదలు పెట్టి పూర్తి చేస్తాడు. తీరా రిలీజ్ సమయానికి చేతిలో డబ్బులు లేక సినిమా ఆగిపోతుంది.
అయితే ఇదిలాఉండగా.. కొన్ని రోజులకు సినిమాలో నటించిన వారు దర్శకుడి వద్దకు వెళుతున్నామని చెప్పి వెళ్లి కిడ్నాప్ అవుతారు. దీంతో ఈ వార్త మీడియాలో హట్ టాపిక్‌గా మారడంతో పొలీస్ అధికారి సత్య (సునీల్) విచారణ మొదలు పెడతాడు.. ఈ క్రమంలో కిడ్నాప్ అయిన వారిలో ఒకరి హత్య జరగగా మరొకరిపై రెండు సార్లు హత్యాయత్నాలు జరుగుతాయి.
ఇక అప్పటి నుంచి స్టోరీ రకరకాలుగా తిరుగుతూ కథ ఓ ఎండింగ్‌కు వచ్చింది అనుకునే లోపు మరో ట్విస్టు వచ్చి మనల్ని షాక్ చేస్తుంది. మొదటి ట్విస్టు మనకు కాసేపు నవ్వు తెప్పించినా అ తర్వాత నాలుగైదు ట్విస్టులు వచ్చి ఇదేం సినిమారా నాయనా ఒక్క సినిమాలో ఇన్ని ట్విస్టులా తెలుగులో ఇలాంటి ఓ సినిమా కూడా తీశారా అని అనిపించక మానదు. ఇక్కడ సినిమా స్టోరీ పైపైన చెప్పాం గానీ సినిమా పూర్తిగా చూస్తే ఎవరైనా మేం చెప్పింది నిజమే అని అనకపోరు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ సినిమా చూసేయండి మరి.
ఇవి కూడా చదవండి:
====================
OTT: ఓటీటీలో.. స్ట్రీమవుతున్న అదిరిపోయే క్రైమ్ ఇన్వెష్టిగేషన్ థ్రిల్లర్! డోంట్ మిస్
**********************
మమితా బైజు.. కుర్రకారుకు ఎందుకింత మోజు
****************************
Vaishnavi Chaitanya: నా లైఫ్ ఎక్కడి నుంచి.. ఎక్కడికి వెళ్లిందో నాకేం అర్థం కావట్లే
*********************