OTT Release: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి విశ్వక్ సేన్ సినిమా

ABN , Publish Date - Dec 13 , 2024 | 10:03 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సైతం ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంటకీ ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే..

Mechanic Rocky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం.. థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా.. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. నవంబర్ 22న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. టాక్ పాజిటివ్‌గా వచ్చినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం అనుకున్నంతగా ఈ చిత్రానికి రాలేదు. ప్రస్తుతం థియేటర్లలో ‘పుష్ప’ ప్రభంజనం నడుస్తుండటంతో ‘మెకానిక్ రాకీ’ సినిమాను ఎర్లీగానే ఓటీటీలోకి తెచ్చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో అందుబాటులోకి వచ్చేసింది. సో.. థియేటర్లలో మిస్ అయిన వారంతా.. ఈ సినిమాను ఓటీటీలో వీక్షించేయండి మరి.

Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ అమెరికా ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా.. ‘పుష్ప’

‘మెకానిక్ రాకీ’ కథ విషయానికి వస్తే.. రాకీ (విశ్వక్‌సేన్‌) అంతంత మాత్రంగా చదివే ఓ కుర్రాడు. తండ్రి రామకృష్ణ(నరేష్‌)కు ఓ మెకానిక్‌ గ్యారేజీ కమ్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో రాకీ కూడా తండ్రి నడిపే షెడ్‌ పని చేయాల్సి వస్తుంది. తను నడిపే డ్రైవింగ్‌ స్కూల్‌కి రాకీ స్నేహితుడు శేఖర్‌ చెల్లి ప్రియా (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్ధా శ్రీనాధ్‌) డ్రైవింగ్‌ నేర్చుకోవడానికి వస్తారు. రాకీ షెడ్డు ఉన్న స్థలంపై రంకి రెడ్డి (సునీల్‌) కన్ను పడుతుంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కాజేయాలనుకొంటాడు. దాన్ని అడ్డుకోవాలంటే రాకీకి రూ.50 లక్షలు కావాలి. మరి ఆ రూ.50 లక్షలు ఎలా సంపాదించాడు? రాకీ స్నేహితుడు శేఖర్‌ ఎందుకు చనిపోయాడు? ఇన్సూరెన్స్‌ పేరుతో జరిగిన స్కామ్‌లో మాయ (శ్రద్దా శ్రీనాథ్‌) పాత్ర ఏంటి? అన్నది తెరపైనే చూడాలి.


Mechanic-Rocky.jpg

ఫస్టాఫ్‌లో కాస్త డిజప్పాయింట్ చేసినా.. సెకండాఫ్ మాత్రం ట్విస్ట్‌లతో దర్శకుడు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాడనేలా ఈ సినిమాకు విమర్శకులు తీర్పు ఇచ్చారు. ఇది దర్శకుడు రవితేజకు తొలి సినిమా. రాసుకున్న కథ, తను చెప్పాలనుకున్నది కరెక్ట్‌గానే ఉన్నా.. సెకండాఫ్‌ పూర్తిగా ట్విస్ట్‌ల మీదే ఆధారపడ్డాడని.. ఫస్టాఫ్‌కు ఇంకాస్త వర్క్‌వుట్‌ చేసి ఎమోషన్స్‌ జోడించి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేదనేలా ఈ సినిమాకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. గత నాలుగైదు ఏళ్ళుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ని ఈ సినిమాలో టచ్ చేసి, సర్‌ప్రైజ్ చేశారు.

Also Read-Allu Arjun: నంద్యాల వాటర్ వంటపట్టిందా.. సుకుమార్ పేరు కూడా తెలియదా

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2024 | 10:03 AM