Kho Kho OTT: ఓటీటీకి.. మలయాళ స్పోర్ట్స్ డ్రామా! మ‌మితా బైజు మాయ చేస్తుందంతే

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:06 PM

సినిమా ప్రియుల‌ను అల‌రించేందుకు కాస్త గ్యాప్ త‌ర్వాత ఓ డ‌బ్బింగ్ మ‌ల‌యాళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఖో ఖో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

kho kho

సినిమా ప్రియుల‌ను అల‌రించేందుకు కాస్త గ్యాప్ త‌ర్వాత ఓ డ‌బ్బింగ్ మ‌ల‌యాళస్పోర్ట్స్ డ్రామా చిత్రం ఖో ఖో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. 2021లో విడుద‌లైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో హిట్ చిత్రంగా నిలవ‌డ‌మే కాక‌, టీవీలో టెలికాస్ట్ అయి అత్య‌ధిక టీఆర్పీ సాధించిన టాప్ 5 మ‌ల‌యాళ సినిమాల్లో ఒక‌టిగా రికార్డు సృష్టించింది. రాహుల్ రిజి నాయ‌ర్ (Rahul Riji Nair) ర‌చ‌న‌తో పాటు ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో రాజీషా విజ‌య‌న్ (Rajisha Vijayan), మ‌మితా బైజు (Mamitha Baiju) కీల‌క పాత్ర‌లు పోషించారు.

Evk0YlrXcAI8MiB.jpeg

కత విష‌యానికి వ‌స్తే.. కేర‌ళ‌లోని ఓ మారుమూల గ్రామంలోని ప్ర‌భుత్వ మ‌హిళ‌ల స్కూల్‌లో పీఈటీగా జాయిన్ అవుతుంది మరియా ఫ్రాన్సిస్. ఈ క్ర‌మంలో ఆమె అక్క‌డి పిల్లల్లో ఉన్న ప్ర‌తిభ‌ను గుర్తించి ఓ ఖో ఖో టీమ్‌ను త‌యారు చేస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌రియాకు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి, పిల్లలు టీచ‌ర్‌కు స‌హ‌క‌రించారా, మ‌ధ్య‌లో టీచ‌ర్‌ ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాక ఏం జ‌రిగిందనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఇంటిల్లిపాదిని అల‌రిస్తుంది.


Etn5mB2VkAMAo56.jpeg

ఇప్పుడు ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో మ‌న ముందుకు వ‌చ్చింది. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త‌, వ‌ల్గారిటీ లేకుండా రూపొందించిన ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం హాయిగా చూసి అస్వాదించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియా సెన్షేష‌న్‌ మ‌మితా బైజు (Mamitha Baiju)ప్రేమ‌లు సినిమా క‌న్నా ముందు ఈ సినిమా ద్వారానే కేర‌ళ‌లో మంచి గుర్తింపును ద‌క్కించుకోవ‌డం విశేషం. అయితే ఈ చిత్రంలో ఖోఖో ప్లేయ‌ర్స్‌గా న‌టించిన వాల్లంతా రియ‌ల్ లైఫ్‌లోనూ ఖోఖో ప్లేయ‌ర్స్ కావ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Jul 25 , 2024 | 12:54 PM

Radhika Apte: ఓటీటీలో బాల‌య్య బ్యూటీ న్యూడ్‌గా న‌టించిన సినిమా! తెలుగులోనూ ట్రెండింగ్‌

Raashi Khanna: ఉన్న‌ట్టా లేన‌ట్టా.. అగ్గి రేపుతున్న రాశీఖ‌న్నా(Video)

Priya Banerjee: రానా బ్యూటీ.. కంటెంటు గ్యారెంటీ! 

Mamitha Baiju: మ‌మితా బైజు.. కుర్ర‌కారుకు ఎందుకింత‌ మోజు

Raashii Khanna: చీరను ఇలా కూడా కట్టొచ్చా.. రాశీఖన్నా