Golam OTT: అంద‌రు ఉండ‌గానే బాస్ మ‌ర్డ‌ర్‌.. ఓటీటీలో డిఫ‌రెంట్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:42 AM

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన డిఫ‌రెంట్‌ మ‌ల‌యాళ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గోలం సినీ అభిమానుల‌ను విప‌రీతంగా అల‌రిస్తుంది. మ‌నం ఇంత‌వ‌ర‌కు చూడ‌ని కాన్సెప్ట్‌తో మంచి స్కీన్‌ప్లే రూపొందిన ఈ మూవీ మంచి థ్రిల్‌ను ఇస్తోంది.

Golam

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన మ‌ల‌యాళ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గోలం (Golam) సినీ అభిమానుల‌ను విప‌రీతంగా అల‌రిస్తుంది. మ‌నం ఇంత‌వ‌ర‌కు చూడ‌ని కాన్సెప్ట్‌తో మంచి స్కీన్‌ప్లే రూపొందిన ఈ మూవీ మంచి థ్రిల్‌ను ఇస్తోంది. రంజిత్ సజీవ్ (Ranjith Sajeev), సన్నీ వేన్ (Sunny Wayne), దిలీష్ పోతన్ (Dileesh Pothan), అలెన్సియర్ లే లోపెజ్ (Alencier Ley Lopez), సిద్ధిక్ (Siddique) కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా స‌మ్జ‌ద్ (Samjad) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జూన్7న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆగ‌స్టులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

GVzVk3-WQAAes1I.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. V-Tech అనే పాపుల‌ర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంటుంది. ఓరోజు ఉద‌యం ఆ కంపెనీలో ప‌ని చేసే ఉద్యోగుల‌తో పాటు, MD ఐజాక్ జాన్ కూడా ఎప్ప‌టిలానే త‌న విధుల నిమిత్తం ఆఫీసుకు వ‌స్తాడు. ఎంప్లాయిస్ కూడా అంతా ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌జ్ఞ‌మై ఉండ‌గా టాయిలెట్‌కు వెళ్లిన MD ఎంత‌కు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఉద్యోగులు మ‌రో తాళం చెవితో డోర్‌ను ఓపెన్ చేయ‌గా అప్ప‌టికే అత‌ని త‌ల‌కు దెబ్బ త‌గిలి చ‌నిపోయి ఉంటాడు. దీంతో ఈ కేసును చేధించ‌డానికి ASP సందీప్ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెట్ట‌గా ఎలాంటి ఆధారాలు ల‌భించ‌వు.


ఈ క్ర‌మంలో ASP సందీప్‌ చిన్న క్లూ దొర‌క‌డంతో న్యూరో స‌ర్జ‌న్‌ను క‌లుస్తాడు. ఈ నేప‌థ్యంలో చాలా విస్తుపోయే అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అది అనుకోకుండా సంభ‌వించిన మ‌ర‌ణం కాద‌ని కావాల‌నే చంపార‌ని, దీనిఇ వెన‌కాల పెద్ద చ‌రిత్రే ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో ASP అస‌లు నిందితుడిని ప‌ట్టుకోగ‌లిగాడా, మ‌ర్డ‌ర్ వెన‌కాల దాగి ఉన్న చీక‌టి కోణం ఏంటి, న్యూరో స‌ర్జ‌న్‌కు ఈ క‌థ‌కు లింకేంటి, అస‌లు చిన్న క్లూ దొర‌క‌కుండా ఎంఫ్లాయిస్ అంద‌రు ఆఫీసులో ఉండ‌గానే హ‌త్య ఎలా జ‌రిగింది అనే ఇంట్రెస్టింగ్ అంశాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌కు సూప‌ర్ థ్రిల్‌ను ఇస్తుంది.

GU-GGhdWIAAiTh8.jpeg

ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవ‌లం మ‌ల‌యాళం భాష‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సస్పెన్స్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు, విభిన్న సినిమాలు లైక్ చేసే వాళ్లు ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ గోలం (Golam) చిత్రాన్ని చూడ‌డం మిస్ చేయ‌కండి. ఈ మూవీ మ‌న భాష‌లో లేకున్నా చూసే వారికి బాగా అర్ధ‌మ‌వుతుంది. ఫ్యామిలీతో క‌ల‌సి హాయిగా చూసేయ‌వ‌చ్చు. మ‌ర్డ‌ర్ వెన‌కాల ఉన్న స్టోరీ కాన్సెప్ట్, మ‌ర్డ‌ర్ జ‌రిగిన విధానం మంచి ఎమోష‌న్‌ను, థ్రిల్‌ను ఇస్తుంది.

Updated Date - Sep 06 , 2024 | 08:42 AM