Kushboo and Indraja: ఒకే స్టేజ్ మీద కుష్బూ, ఇంద్రజ.. డ్యాన్స్ ఇరగ్గొట్టేశారు

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:14 PM

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఇంద్రజ, ఖుష్భూలు రాజ్యమేలుతున్నారు. వారిరువు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతలుగా తమదైన పంథాలో దూసుకెళుతున్నారు. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్’ షోలను వారిద్దరూ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి ఒకే స్టేజ్ మీద డ్యాన్స్ ఇరగ్గొట్టేశారు.. ఆ వివరాల్లోకి వెళితే..

Indraja and Kushboo

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఖుష్భూ (Kushboo), ఇంద్రజ (Indraja)లు రాజ్యమేలుతున్నారు. వారిరువు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతలుగా తమదైన పంథాలో దూసుకెళుతున్నారు. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్’ షోలను వారిద్దరూ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వేరే వేరే కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు కలిసి ఒకే స్టేజ్ మీద సందడి చేయబోతున్నారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీ చేస్తోన్న ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూలు కలిసి కనిపించారు. (Vinayaka Chavithi Special Event)

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో ‘జై జై గణేశా’ అనే ప్రోగ్రాంను ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక ఈ ఎపిసోడ్‌లో జబర్దస్త్ జడ్జ్ అయిన కుష్బూ, శ్రీదేవీ డ్రామా కంపెనీని నడిపిస్తున్న ఇంద్రజ కలిసి సందడి చేయబోతోన్నారు. వీరితో పాటు హీరో శివాజీ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.

Also Read- Nithiin: తండ్రైన నితిన్‌.. షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు



Indraja.jpg

కుష్బూ, ఇంద్రజ వేసిన డ్యాన్స్‌లకు, వారి ఇంట్రోలకు శివాజీ ఫిదా అయ్యారు. మేడం సర్ మేడం అంతే అని హ్యాట్సాఫ్ చెప్పేశారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. మరి ఈ సీనియర్ స్టార్ నటీమణులు చేసే హంగామాకు ఈ వినాయక చవితి వేదికగా మారింది. ఇక వీక్షకులు ఆ సందడికి సిద్ధమవ్వండి..

Read Latest Cinema News

Updated Date - Sep 06 , 2024 | 08:14 PM