Raghu Thatha OTT: డైరెక్ట్‌ ఓటీటీకి.. కీర్తి సురేశ్ లేటెస్ట్ పొటిలిక‌ల్ సెటైర్ కామెడీ! డోంట్‌మిస్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 08:05 PM

ఇటీవల తమిళనాట విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఓ పొలిటిక‌ల్‌ కామెడీ డ్రామా చిత్రం రఘు తాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించ‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాతో త‌మిళ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది.

raghu thatha

ఇటీవల తమిళనాట విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఓ పొలిటిక‌ల్‌ కామెడీ డ్రామా చిత్రం రఘు తాత (Raghu Thatha) ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించ‌గా ‘కేజీఎఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ సినిమాతో త‌మిళ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్ట‌డం విశేషం. అంతే కాదు ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి బాలీవుడ్‌హిట్‌ వెబ్‌ సిరీస్‌లకు కథా రచయితగా పని చేసిన సుమన్‌ కుమార్‌ (Suman Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించాడు. రవీంద్ర విజ‌య్ (Ravindra Vijay), ఎమ్మెస్ భాస్కర్ (M. S. Bhaskar), స‌మి, దేవ‌ద‌ర్శిణి (Devadarshini) ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఆగ‌స్టులో థియేట‌ర్ల‌లోరిలీజైన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించి ట్రైల‌ర్ కూడా వ‌దిలారు కానీ కేవ‌లం త‌మిళంలో మాత్ర‌మే రిలీజ్ చేసి ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ తీసుకువ‌స్తున్నారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1970 నేప‌థ్యంలో నాడు హిందీ భాషను మహిళలపై బలవంతంగా రుద్దడంపై సెటైరిక్ పంచులు వేస్తూ కామెడీ టచ్‌తో ఈ సినిమాను రూపొందించారు. కాయ‌ల్ పాండియ‌న్ ఓ బ్యాంక్‌లో క్ల‌ర్క్‌గా ప‌ని చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ప‌దోన్న‌తి వ‌చ్చే క్ర‌మంలో హిందీ భాష త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి ఉండాలని స‌ద‌రు బ్యాంకు ష‌ర‌తు పెడుతుంది. దీంతో అప్ప‌టికే బాగా ఫెమినిస్ట్ , రెబ‌ల్ ల‌క్ష‌ణాలు ఉన్న కాయ‌ల్ ఆ ష‌ర‌తును వ్య‌తిరేకిస్తుంది. అదే స‌మ‌యంలో ఆమె లైఫ్‌లోకి సెల్వ‌న్ అనే ఇంజినీర్ రాగా త‌న జీవితం మ‌లుపు తిరుగుతుంది. సెల్వ‌న్‌ను త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని చూస్తుంది. ఈ నేప‌థ్యంలో కాయ‌ల్ తిరిగి హిందీని ఎందుకు నేర్చుకోవాల‌నుకుంది, చివ‌ర‌కు నేర్చుకుందా లేదా, అస‌లు సెల్వ‌న్ ఎవ‌ర‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాతో సినిమా సాగుతుంది.

GXBhHsTacAA6yTZ.jpeg


సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఫీల్ గుడ్‌గా న‌డుస్తూ చూసే ప్రేక్ష‌కుల‌ను సినిమాలోకి తీసుకోళుతుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా మంచి సెటైరిక్ డైలాగులు, కీర్తి సురేశ్‌, ర‌వీంద్ర విజయ్ న‌ట‌న మెస్మ‌రౌజ్ చేస్తాయి. దేవ ద‌ర్శిణి కామెడీ సినిమాకు హైలెట్ అవ్వ‌గా సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది. 70ల‌లో నాటి గ్రామాలు, ప్ర‌జ‌ల తీరుతెన్నులను, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలతో పాటు వారికి విధించే ఆంక్షలను, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన చిన్నచిన్న విషయాలను కూడా సెటైరికల్‌గా చూపించారు. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 13 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. సినిమాలె ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త‌, అశ్లీల స‌న్నివేశాలు లేవు ఇంటిల్లి పాది అంతా క‌లిసి ఈ రఘు తాత (Raghu Thatha) సినిమాను చూసి ఆస్వాదించ‌వ‌చ్చు. డోంట్ మిస్‌.

Updated Date - Sep 09 , 2024 | 08:08 PM