Bhaje Vaayu Vegam: Ottకి.. లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్!ఎప్ప‌టినుంచంటే

ABN , Publish Date - Jun 24 , 2024 | 08:52 PM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు లేటెస్ట్‌ తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం భజే వాయు వేగం రెడీ అయింది. కార్తికేయ, ఐశ్వర్య మీనన్ హీరో, హీరోయిన్‌గా నటించ‌గా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మించింది.

Bhaje Vaayu Vegam: Ottకి.. లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్!ఎప్ప‌టినుంచంటే
Bhaje Vaayu Vegam

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మంచి తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) రెడీ అయింది. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా, ఐశ్వర్య మీనన్ (Ishwarya Menon) హీరోయిన్‌గా నటించ‌గా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV Concepts) బ్యానర్ నిర్మించింది. హ్యాపీడేస్ ఫేం రాహుల్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. గత నెల 31న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా మొద‌టి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ మూవీని ప్రశాంత్ రెడ్డి రూపొందించారు.

GO_ceTtasAACIvn.jpeg

సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్న తండ్రిని ర‌క్షించుకునేందుకు డ‌బ్బు కోసం పేద‌వారైన‌ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని విజ‌యం సాధిస్తారు. అయితే ఆ డ‌బ్బును డేవిడ్ గ్యాంగ్ ఇస్తామ‌ని చెప్పి ఎగ్గోడ‌తారు.పైగా వారి వ‌ద్ద ఉన్న డ‌బ్బును కూడా బ‌ల‌వంతంగా లాక్కెళ‌తారు. దీంతో అ అన్న‌ద‌మ్ములు హోట‌ల్‌లో పార్క్ చేసి ఉన్న ఖ‌రీదైన డేవిడ్‌ కారును దొంగ‌త‌నం చేస్తారు. అయితే అందులో అప్ప‌టికే ఓ వ్య‌క్తి శ‌వంతో పాటు , ఓ హావాలా డ‌బ్బుకు సంబంధించిన‌ నోటు ఉంటుంది.


దీంతో డేవిడ్ గ్యాంగ్ అన్న‌ద‌మ్ముల వెంట ప‌డుతుండ‌గా వారికి ఓక్కో ర‌హాస్యం తెలుస్తూ వ‌స్తుంది. చివ‌ర‌కు ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లో క‌థ ఎన్ని ర‌కాల మ‌లుపులు తిరిగింది, తండ్రి బ‌తికాడా, హీరోయిన్ డేవిడ్‌తో గ‌డ‌ప‌డానికి ఎందుకు వెళ్లిందనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెడుతుంది.

GQ1kesUXAAArf2V.jpeg

సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా స్పీడ్ స్క్రీన్‌ప్లేతో ప‌రుగెత్తుతూ మంచి థ్రిల్‌ను పంచుతుంది. ఈ వారంతంలో మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఈ సినిమా భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam)ను ఎట్టి పిస్థితుల్లోనూ మిస్ చేయ‌కండి. ఈ నెల 28వ తేదీ నుంచి ప్ర‌ముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ‌నుంది. ఈ విష‌యాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

Updated Date - Jun 24 , 2024 | 08:52 PM