Blink OTT: తెలుగులోనూ.. స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్! డోంట్‌మిస్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:22 PM

రెండు, మూడు నెల‌ల క్రితం కేవ‌లం క‌న్న‌డ భాష‌లో మాత్ర‌మే ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చిన బ్లింక్ అనే చిత్రం ఇన్నాళ్లకు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఓ వినూత్న ప్ర‌పంచంలో విహ‌రింప జేసేందుకు వ‌చ్చేసింది. థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయవద్దు.

రెండు, మూడు నెల‌ల క్రితం కేవ‌లం క‌న్న‌డ భాష‌లో మాత్ర‌మే ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చిన బ్లింక్ (Blink) అనే చిత్రం ఇన్నాళ్లకు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఓ వినూత్న ప్ర‌పంచంలో విహ‌రింప జేసేందుకు వ‌చ్చేసింది. నాని ద‌స‌రా సినిమాలో న‌టించిన దీక్షిత్ షెట్టి (Dheekshith Shetty) ఇందులో హీరో కాగా, మ్యూజిక‌ల్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ బ్లింక్ (Blink) చిత్రం తెర‌కెక్కింది. చైత్ర ఆచార్ (Chaithra J. Achar), మందార బత్తలహళ్లి (Mandara Battalahalli), గోపాల్‌కృష్ణ దేశ్‌పాండే (Gopalkrishna Deshpande) కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు.

GITAsf2b0AAINRW.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. అపూర్వ (దీక్షిత్ షెట్టి ) బెంగ‌ళూరులో పీజీ (MA) చ‌దువుతూ పార్ట్ టైం జాబ్‌ల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఈక్ర‌మంలో త‌న గ‌ర్ల్‌ప్రెండ్ స్వ‌ప్న సాయం తీసుకుంటాడు. ఓ డ్రామా కంపెనీలో త‌రుచూ ఇద్ద‌రురిహార్స‌ల్ చేస్తూ ఉంటారు. అయితే ఓ రోజు అపూర్వ‌కు ఉన్న‌ట్టుండి ఓ మ‌ధ్య వ‌య‌స్కుడు, అచ్చం త‌న‌లాగే ఉండే మ‌రో మ‌నిషి రెండు మూడు సార్లు క‌నిపించి మాయ‌మైపోతారు. దీంతో త‌న‌కు ఏదో అయింద‌ని డిఫ్రెష‌న్‌లోకి వెళ‌తాడు. కొద్ది రోజుల త‌ర్వాత ఓ జాబ్ ఆఫ‌ర్ రావ‌డంతో అక్క‌డికి వెళ్లగా త‌న‌కు అంత‌కుముందు క‌నిపించి మాయ‌మైన‌ మ‌ధ్య వ‌య‌స్కుడు క‌నిపిస్తాడు. దీంతో అపూర్వ షాక్ అవుతాడు. అక్క‌డి నుంచి వెళ్లి పోవాల‌ని ప్ర‌య‌త్నించ‌గా నీ తండ్రి, అత‌ని మ‌ర‌ణం గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పింది చేయాల‌ని డ‌బ్బులు ఇస్తానంటాడంతో అపూర్వ అంగీక‌రిస్తాడు.


GUyKOwMboAAOpRD.jpeg

దీంతో అ మ‌ధ్య వ‌య‌స్కుడు ఓ ఐ డ్రాప్స్ , వాచ్ ఇచ్చి వాటితో నువ్వు టైం ట్రావెల్ చేయాల‌ని చెబుతాడు. డ్రాప్స్ వేసుకున్నాక కండ్లు బ్లింక్ చేయ‌కుండా ఎంత‌సేపు ఉండ‌గ‌ల‌వో అంత సేపు అక్క‌డ ఉండొచ్చ‌ని బ్లింక్ చేస్తే తిరిగి ప్ర‌జెంట్ డేకు వ‌స్తావ‌ని చెబుతాడు. దీంతో అపూర్వ టైం ట్రావెల్ చేయ‌డం స్టార్ట్ చేస్తాడు.. ఇక ఆ త‌ర్వాత ఎలాంటి విష‌యాలు తెలిశాయి, ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌నేదే అస‌లు క‌థ‌. అపూర్వ టైం ట్రావెల్ చేసి వ‌చ్చిన ప్ర‌తీసారి ఏదో కొత్త విష‌యం బ‌య‌ట ప‌డి ప్రేక్ష‌కుల‌ను షాక్ గురి చేస్తుంటాయి.

త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌నిపించిన త‌న‌లాగే ఉన్న‌ యువ‌కుడెవ‌రు, ఆ మ‌ధ్య వ‌య‌స్కుడు ఎవ‌రు, అపూర్వ‌కు వారితో ఉన్న‌ సంబంధమేంటి, తండ్రిని ర‌క్షించుకున్నాడా? అనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ చూసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్ట‌డం ఖాయం. ముఖ్యంగా చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. చివ‌ర‌కు హీరో చేసిన ప‌ని కూడా అలోచింప‌చేస్తుంది. సంగీతం ఈ చిత్రానికి చాలా ఫ్ల‌స్ కాగా బ్లింక్ (Blink) సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

అయితే.. మొద‌టి ఫ్రేం నుంచి ఎక్క‌డా మిస్ చేయ‌కుండా చూస్తేనే ఈ సినిమాను అర్ధ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. లేకుంటే క‌న్ప్యూజ్ అవ‌డం గ్యారెంటీ. ఈ బ్లింక్ (Blink) సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో క‌న్న‌డ‌తో పాటు తెలుగు భాష‌లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మంచి థ్రిల్ల‌ర్‌, సైన్స్ ఫిక్ష‌న్ చూడాల‌నుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయ‌కండి. సినిమా పూర్త‌య్యాక ఇలాంటి ఓ సినిమా మ‌న‌వాళ్లు తీశారా అనిపిస్తుంది. ఇదిలాఉండ‌గా ఇండియాలో ఈ జాన‌ర్‌లో రూపొందిన మొట్ట‌మొద‌టి సినిమా ఇదే కావ‌డం విశేషం.

Updated Date - Aug 21 , 2024 | 01:22 PM