Kajal Karthika: ఓటీటీలోకి.. కాజల్, రెజీనా హర్రర్, థ్రిల్లర్!ఫ్యామిలీస్ బీ రెడీ
ABN , Publish Date - Apr 08 , 2024 | 08:29 PM
కాజల్ అగర్వాల్ , రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కాజల్ కార్తిక. హర్రర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 9నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రెజీనా కసాండ్రా (Regena Cassandrra) ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో దీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా వస్తున్న సినిమా కాజల్ కార్తిక (Kajal Karthika). హర్రర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం.
విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ మరియు ప్రసాద్. ఎస్. ఎన్. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ అవుతోంది. కామెడీ, హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కామెడీ, హర్రర్ లవర్స్ ఏప్రిల్ 9న ఆహా (ahavideoIN)లో ఈ సినిమా చూసేయండి.
ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా అనిపించింది. 5 వేర్వేరు కథలతో కాజల్ (Kajal Aggarwal)కి రెజీనా (Regena Cassandrra)కి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? కామెడీ ఉంటునే హర్రర్ ఇంపాక్ట్ ని చాలా బాగా క్రియేట్ చేశారు.
ట్రైలర్ చూస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఒక మంచి కామెడీ హర్రర్ ఫిలిం కోసం ఎదురుచూసే వాళ్ళకి ఏప్రిల్ 9న 'కాజల్ కార్తీక' (Kajal Karthika) హనుమాన్ మీడియా ద్వారా ఆహా (ahavideoIN) లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.