Antony: ఓటీటీలో అద‌ర‌గొడుతున్న‌.. ఆదికేశ‌వ విలన్ జోజు జార్జ్ యాక్ష‌న్‌ సినిమా

ABN , Publish Date - Feb 23 , 2024 | 05:53 PM

మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తుంటాయన్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. ఇక తాజాగా తెలుగు,త‌మిళ రాష్ట్రాల‌లో ఈ మధ్య జోజు జార్జ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. తాజాగా ఇప్పుడు జోజు జార్జ్ న‌టించిన చిత్రం అంటోని ఓటీటీలోకి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

 Antony: ఓటీటీలో అద‌ర‌గొడుతున్న‌.. ఆదికేశ‌వ విలన్ జోజు జార్జ్ యాక్ష‌న్‌ సినిమా
antony

మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తుంటాయన్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. ఇక తాజాగా తెలుగు,త‌మిళ రాష్ట్రాల‌లో ఈ మధ్య జోజు జార్జ్ (Joju George) సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్ప‌టికే ఇత‌ను న‌టించిన నాయ‌ట్టును కోట బొమ్మాలిగా, పొరింజు మ‌రియం జోస్ సినిమాను నా సామిరంగా గా తెలుగులో రిమేక్ చేశారు. అయితే ఇప్పుడు జోజు జార్జ్ (Joju George) న‌టించిన మ‌రో చిత్రం అంటోని (Antony) గత ఏడాది చివ‌ర‌లో విడుద‌ల‌వ‌గా కేర‌ళ‌లో మంచి విజ‌యాన్ని అందుకుంది.

WhatsApp Image 2024-02-23 at 3.00.37 PM.jpeg

ఇందులో జోజు జార్జ్ (Joju George), కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ల‌ నటన గురించి కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూశారు. ఇప్పుడు వారి ఆశ‌ల‌ను నిజం చేస్తూ ‘ఆంటోని’ (Antony) సినిమాను నేడు (ఫిబ్రవరి 23) ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా (aha video in)లో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు.


ఇక తెలుగు ఆడియెన్స్ ఇంటిలో మ‌న భాష‌లోనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూసి ఆనందించొచ్చు. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1, 2023న విడుదల‌వ‌గా మంచి రివ్యూలతో పాటు, కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తెలుగులో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

WhatsApp Image 2024-02-23 at 3.00.37 PM (1).jpeg

ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మీద ఆంటోని చిత్రం సాగుతుంది. ఈ ‘ఆంటోని’ (Antony) మూవీలో టైటిల్ రోల్‌లో జోజు జార్జ్ (Joju George) నటించారు. రాజేష్ వర్మ అందించిన కథతో జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయరాఘవన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రఫర్‌గా రెనాదివ్, ఎడిటర్‌గా శ్యామ్ శశిధరన్ పని చేశారు.

Updated Date - Feb 23 , 2024 | 05:53 PM