Aaha Ott: ఓటీటీలో.. ఆహకు అదిరిపోయే రెస్పాన్స్
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:34 PM
ఇటీవల ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఆహా' ఫ్యామిలీ అడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ఇటీవల ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఆహా' (Aaha) ఫ్యామిలీ అడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 2021 లో మలయాళంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. సలార్, ది గోట్ లైఫ్ చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన ఫృథ్వీరాజ్ సుకుమారన్ అన్న ఇంద్రజిత్ సుకుమారన్ (Indrajith Sukumaran) లీడ్ రోల్‌లో చేయగా మనోజ్ కె. జయన్ (Manoj K. Jayan), అశ్విన్ కుమార్ (Ashwin Kkumar), శాంతి బాలచంద్రన్ (Santhy Balachandran), అమిత్ (Amith Chakalakkal) ఇతర పాత్రల్లో నటించారు. బిబిన్ పాల్ శామ్యూల్ (Bibin Paul Samuel) దర్శకత్వం వహించగా సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు.
కథ విషయానికి వస్తే.. 1980, 1990లలో బాగా ప్రాచుర్యం పొందిన గేమ్ టగ్ ఆఫ్ వార్ టీమ్ నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. కేరళలోని ఓ ప్రాతంలోని ఆహానీలూరు అనే టైమ్ 15 సంవత్సరాలుగా టగ్ ఆఫ్ వార్ గేమ్‌లో ఛాంపియన్స్‌గా ఉంటారు. అయితే ఓ రోజు వాళ్ల టీం ఓటమి చెందడంతో ఆందుకు కొచ్చు కారణమంటూ బ్లేమ్ చేస్తారు. దాంతో అతను అన్నీ వదిలేసి గేమ్‌కు దూరంగా ఒంటరిగా ఉంటూ తన లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అలా కొన్నాళ్లకు వాళ్ల టీమ్ కూడా కనుమరుగవుతుంది.
ఈక్రమంలో చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి సంబంధించిన కొంతమంది యువకులు కలిసి టగ్ ఆప్ వార్ టీమ్‌ను రెడీ చేసి ఆట ఆడాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ అందులోని ఎవరికీ ఆట గురించి సరిగ్గా తెలియక పోవడంతో నాటి ప్లేయర్ కొచ్చును కోచ్‌గా ఉండాలని కోరుతారు. అందుకు అతను ఒప్పుకున్నాడా, ఆ టీం ఏం చేసింది, అసలు నాడు టీం ఓడిపోవడానికి ఎవరు కారణమనే ఆసక్తికరమైన కథకథనాలతో ఈ 'ఆహా' (Aaha) సినిమా సాగుతుంది.
ఇప్పటికే ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. రియల్‌గా జరిగిన ఘటన నేపథ్యంలో ఎక్కడా బోర్ కొట్టకుండా అద్భుతమైన కేరళ ప్రకృతి అందాల మధ్య రూపొందించారు. సినిమాల్లో ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు పిల్లు, కుటుంబ సమేతంగా కలిసి చూసి ఆస్వాధించొచ్చు. ఈ సినిమాలో హీరోగా చేసిన ఇంద్రజిత్ సుకుమారన్ (Indrajith Sukumaran) ఇటీవల త్రిష ప్రధాన పాత్రలో వచ్చి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బృంద అనే తెలుగు వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించడం విశేషం.