నీకో దండం త‌ల్లో.. ఇదేం యాక్ష‌న్ సినిమారా నాయ‌నా! ప‌ది దేశాల్లో బ్యాన్ ఏ ఓటీటీలో ఉందంటే

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:00 AM

ఇటీవ‌ల డైరెక్ట్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ వ‌చ్చిన చిత్రం ది షాడో స్ట్రేస్. ఇండోనేషియ‌న్ లాంగ్వేజ్‌లో రూపొందిన ఈ చిత్రం యాక్ష‌న్ ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

the shadow

ఇటీవ‌ల డైరెక్ట్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ వ‌చ్చిన చిత్రం ది షాడో స్ట్రేస్ (The Shadow Strays). ఇండోనేషియ‌న్ లాంగ్వేజ్‌లో రూపొందిన ఈ చిత్రం యాక్ష‌న్ ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. గ‌తంలో ఇదే జాన‌ర్‌లో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించి ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న హై ఓల్టేజీ యాక్ష‌న్ చిత్రాలు సిసు, జాన్ విక్ చిత్రాల‌ను త‌ల‌ద‌న్నేలా ఈ మూవీ ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అవ‌డం ఓ కొస‌మెరుపు. అరోరా రిబెరో (Aurora Ribero), హనా మలాసన్, తస్క నామ్యా, ఆగ్రా పిలియాంగ్, అంద్రి మాషాది,చూ కిన్ వా కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా టిమో త్జాజాంటో (Timo Tjahjanto) స్టోరీ, స్క్రీన్ ప్లేతో అందించ‌డంతో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

MV5BODdmZTc0MzktN2IwNy00NWJiLTlmZWEtZjVjNGY1ODEzNjk5XkEyXkFqcGc@._V1_.jpg

క‌థ విష‌యానికి వ‌స్తే.. కోడ్ 13 ఓ షాడో సంస్థలో కిరాయి హంత‌కురాలిగా ఉంటూ జపాన్‌లో ఓ విద్వ‌సంక‌ర‌మైన మిష‌న్‌లో పాల్గొని తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంటుంది. ఆపై స‌స్పెండ్ అయి త‌న ఇంటికి వ‌చ్చేస్తుంది. అదే స‌మ‌యంలో ప‌క్కన ఇంట్లో తల్లి చ‌నిపోయి ఒంట‌రిగా ఉంటున్న ఓ ప‌దేండ్ల అబ్బాయి (మోంజీ) కి అండ‌గా ఉంటుంది. ఆపై తిరిగి త‌న జాబ్‌లో చేరాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా స‌ద‌రు సంస్థ నుంచి స‌రైన రెస్పాన్స్ రాక‌పోడంతో తీవ్ర ఆగ్ర‌హంతో ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఓ డ్ర‌గ్స్ ముఠా మోంజీని కిడ్నాప్ చేయ‌డంతో కోడ్ 13 ఆత‌నిని ర‌క్షించేందుకు రంగంలోకి దిగుతుంది. తీరా ఒక్కొక్క‌రినే ఎదుర్కొంటూ పోతుండ‌గా చివ‌ర‌కు త‌ను ప‌ని చేసే సంస్థే దీని వెన‌కాల ఉన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కోడ్ 13 క్రూర‌మైన ఆ గ్యాంగుల‌ను, త‌న షాడో సంస్థ‌ను ఒంట‌రిగా ఎలా ఎదిరించిందనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.


The-Shadow-Strays_Still_01-1900x560-1.jpg

సుమారు రెండున్న‌ర గంట‌ల నిడివితో డైరెక్టుగా ఆక్టోబ‌ర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ చిత్రంపై చాలామందికి ఏ కొద్దిగా కూడా అంచ‌నాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ఒక్క‌సారి చూస్తే చాలు వారికి స‌రిపోను ఫుల్ మీల్స్ దొరికిన‌ట్టే లెక్క‌. అంత‌లా ఈ సినిమా పోరాట స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకుంటుంది. సినిమా ప్రారంభ‌మే మ‌న దిమ్మ‌తిరిగే యాక్ష‌న్ సీక్వెన్స్‌తో ప్రారంభ‌మై ఆ త‌ర్వాత‌ ప్ర‌తి ఐదు నిమిషాల‌కోక‌టి చొప్పున సినిమా అసాంతం యాక్ష‌న్ సీన్ల‌తోన్లు వ‌స్తూనే ఉంటాయి. పైగా ఒక ఫైటింగ్ స‌న్నివేశానికి మ‌రో ఫైటింగ్ సీన్‌కు సంబంధం లేకుండా దేనికి ఆదే ప్ర‌త్యేకంగా ఉండ‌డం చెప్పుకోద‌గ్గ విష‌యం. ఇన్నాళ్లు మ‌నం తోపు అనుకున్న సిసు, జాన్ విక్, ఇటీవ‌ల‌ హిందీలో వ‌చ్చిన కిల్ చిత్రాలు కూడా ఈ ది షాడో స్ట్రేస్ (The Shadow Strays) సినిమా కింద ఏ మాత్రం ప‌నికిరాదంటే అతిశ‌యోక్తి లేదు.

GXrec8ia0AAPlaA.jpeg

ఇదిలాఉండ‌గా ఇండోనేషియా నుంచి వ‌చ్చిన ఈ చిత్రం ఇటీవ‌ల డైరెక్టు ఓటీటీలో రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ఆ దేశంలోనే ఇప్ప‌టికీ విడుద‌ల‌కు నోచుకోక పోవ‌డం విడ్డూరం కాగా మ‌రో 10 దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించారంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉందో.. హింసాత్మ‌క స‌న్నివేశాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఎక్క‌డో ఒక‌టి రెండు చోట్ల పైపైన మ‌సాలా సీన్లు ఉన్న‌ప్ప‌టికీ టోట‌ల్ సినిమా యాక్ష‌న్ నేప‌థ్యంలోనే న‌డుస్తుంది. అంతేకాదు సినిమా చివ‌ర‌లో గ్యాంగ్‌ను అంత‌మొందించింది ఇక సినిమా అయిపోయింద‌నుకకుంట అప్పుడే అస‌లు ట్విస్టు వ‌చ్చి మ‌రో 20 నిమిషాల భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ వ‌చ్చి క‌ట్టి ప‌డేస్తుంది. మొత్తంగా చెప్పెదేంటంటే అదిరిపోయే యాక్ష‌న్‌ సినిమా కావాల‌నుకునే వారు ఈ ది షాడో స్ట్రేస్ (The Shadow Strays) సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌కుండా చూసి త‌రించాల్సిందే. తెలుగు భాష‌లో లేక‌పోయిన‌ప్ప‌టికీ హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో అందుబాటులో ఉంది.

GXrec8mbAAAvSV4.jpeg

Updated Date - Oct 29 , 2024 | 12:05 PM