YouTube: యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌లో హాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల దండ‌యాత్ర‌.. వంద‌ల‌కు పైగానే

ABN , Publish Date - Feb 13 , 2024 | 07:24 PM

తెలుగు రాష్ట్రాల‌లో చాలా మంది సినిమా అభిమానులు డ‌బ్బింగ్ సినిమాల‌ను బాగా ఇష్ట ప‌డుతుంటారు. స‌రిగ్గా అలాంటి వారి కోస‌మే అన్న‌ట్లుగా యూ ట్యూబ్ ఛాన‌ళ్లు రోజుకోటి పుట్టుకొచ్చి ప్ర‌పంచంలో ఉన్న అన్ని భాష‌ల సినిమాల‌ను కిందా మీద ప‌డి డ‌బ్బింగ్ చేస్తు తెలుగు ప్రేక్ష‌కుల పైకి వ‌దులుతున్నారు.

YouTube: యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌లో హాలీవుడ్ డ‌బ్బింగ్ సినిమాల దండ‌యాత్ర‌.. వంద‌ల‌కు పైగానే
YOUTUBE MOVIES

తెలుగు రాష్ట్రాల‌లో చాలా మంది సినిమా అభిమానులు డ‌బ్బింగ్ సినిమాల‌ను బాగా ఇష్ట ప‌డుతుంటారు. కంట్రీతో సంబంధం లేకుండా ఏ దేశం నుంచి వ‌చ్చిన సినిమా అయినా తెలుగు భాష‌లోకి డ‌బ్ అయి వ‌స్తే చాలు తెగ చూసేస్తుంటారు. ఓటీటీలు వ‌చ్చాక ఆ కొర‌త చాలా వ‌ర‌కు తీరినప్ప‌టికీ ఇంకా కావాలని అనుకునే ప్రేక్ష‌కుల సంఖ్య అధికంగానే ఉంది. స‌రిగ్గా అలాంటి వారి కోస‌మే అన్న‌ట్లుగా యూ ట్యూబ్ ఛాన‌ళ్లు రోజుకోటి పుట్టుకొచ్చి ప్ర‌పంచంలో ఉన్న అన్ని భాష‌ల సినిమాల‌ను కిందా మీద ప‌డి డ‌బ్బింగ్ చేస్తు తెలుగు ప్రేక్ష‌కుల పైకి వ‌దులుతున్నారు. దీంతో ఇప్పుడు చూసే వారి క‌న్నా సినిమాల కంటెంట్ డ‌బుల్ అయింది.

అయితే ఈ సినిమాల్లో చాలా వ‌ర‌కు డ‌బ్బింగ్ మంచిగానే ఉంటున్న‌ప్ప‌టికీ కొన్ని సినిమాలు ఆయా దేశాల‌లో వ‌దిలేసిన‌వో, తీసేసిన‌వో, లో బ‌డ్జెట్ సినిమాల‌ను ఇక్క‌డికి తీసుకువ‌చ్చి డ‌బ్బింగ్ కూడా అతికీ అత‌క‌న‌ట్టుగా, సంబంధం లేకుండా ఎడిటింగులు చేసి ఆక‌ర్శ‌ణీయ‌మైన తంబ్‌నెయిల్స్ పెట్టి త‌మ త‌మ యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వేల సినిమాల‌ను రిలీజ్ చేశారు. గ‌డిచిన రెండు మూడు వారాలుగా సినిమాల విడుద‌ల సంఖ్య ఇంకా చాలా రెట్టింపు అయింది. ఇదిలాఉండ‌గా యూ ట్యూబ్‌లో వ‌రుస‌బెట్టి వ‌స్తున్న ఈ సినిమాల‌న్నీ గంట‌న్న‌రలోపే ఉండ‌డం చూసే వారికి చాలా ఉప‌శ‌మ‌నం కలిగిస్తోంది.

అయితే యూ ట్యూబ్ లో వచ్చిన,వస్తున్న సినిమాల‌న్నీ ఒక్క జాన‌ర్‌కే ప‌రిమితం కాకుండా అన్ని ర‌కాల సినిమాలు ఉండ‌గా దాదాపు ఎక్కువ‌ సినిమాలు చైనీస్‌, కొరియ‌న్‌వే ఉండ‌డం విశేషం. డ‌బ్బింగ్ సినిమాలంటే ఇష్టం ఉన్న వారి కోసం ఇటీవ‌ల యూ ట్యూబ్‌లో వ‌చ్చిన సినిమాలేంటో వాటి వివ‌రాలు కింద ప్రత్యేకంగా మీ కోసం ఇవ్వడం జరుగుతోంది. అయితే ఒక్క‌టి కాదు రెండు కాదు వంద‌ల సంఖ్య‌లో సినిమాలు ఉన్న నేప‌థ్యంలో గ‌త రెండు, మూడు వారాల‌లో వ‌చ్చిన చిత్రాల వివ‌రాల‌ను మాత్ర‌మే అందించ‌డం జ‌రుగుతోంది. ఆస‌క్తి ఉన్న వారు ఆయా ఛాన‌ళ్లకు వెళ్లి వీక్షించొచ్చు.


IOF - Telugu (Indo Overseas Films) Channel , Dimension On Demand Channel ,Shreyas Telugu Movies, Bhavani Movies, Tollywood Box Office, Hollywood Telugu, VR Films and Studios Telugu, Hollywood Telugu వంటి వాటితో పాటు ఇంకా డ‌జ‌నుకు పైగా ఛాన‌ళ్ల‌లో చాలా సినిమాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

IOF - Telugu (IndoOverseasFil) Channel

Monkey King: The One and Only

Telug Lei Zhen Zi of the Creation Gods

Thanks Giving

Creepy Crawlies

22 Minutes

The Conqueror

Fire and Ice: The Dragon Chronicles

LEIO

Southern Shaolin

The Labyrinth

Chang An Fog Master

Night of the Sicario

The Legend of Deification

The River Monster

Monkey King: The One and Only

Dimension On Demand Channel

THE ABYSS RESCUE (ఎబిసిస్ రెస్క్యూ)

BLADE OF THE ROSE (బ్లేడ్ ఆఫ్ ద రోస్)

THE LEGEND OF LIVING SOULS (ది లెజెండ్ ఆఫ్ లివింగ్ సోల్స్)

UNEARTHED (ఆన్ ఎర్త్డ్)

Shreyas Telugu Movies

GOLD HUNTER (గోల్డ్ హంటర్ )

ALIENS GALAXY (ఎలియెన్స్ గాలక్సీ) - Sci-Fi

BERLIN ATTACK (బెర్లిన్ అటాక్)

Bhavani Movies

Detective Vincent

Jackie Chan's SHINJUKU INCIDENT

Updated Date - Feb 13 , 2024 | 07:34 PM