7/G: ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా.. టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్

ABN , Publish Date - Dec 12 , 2024 | 04:44 PM

7/G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా.. ఇప్పుడు ఆడియెన్స్‌ని ఇళ్లల్లోనే భయపెట్టడానికి సిద్ధమైంది.

సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ 7/G. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విపిన్.. మ్యూజిక్ కూడా అందించాడు. ఈ ఏడాది జులైలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఆగష్టులో ఓటీటీలో రిలీజ్ కాగా తాజాగా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈరోజు నుంచి సోనియా అగర్వాల్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ 7/G ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

WhatsApp Image 2024-12-12 at 15.48.17 (2).jpegWhatsApp Image 2024-12-12 at 15.48.17.jpeg


ఈ సినిమాకి హరూన్ దర్శకత్వం పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ నటి సోనియాకి సెకండ్ ఇన్నింగ్స్. ఆమె గతంలో తెలుగులో సూపర్ హిట్ అయిన 7G బృందవన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా.. ఇప్పుడు మళ్లీ దాదాపు అదే టైటిల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్‌ని ఎదురుకుంది, వారి ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ఇప్పుడీ చిత్రం అందరి ఫేవరేట్ ఆహా ఓటీటీలో భవానీ మీడియా ద్వారా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ప్రేక్షకులని కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో ఎట్టిపరిస్థితిలో మిస్ కావద్దు.

Updated Date - Dec 12 , 2024 | 04:44 PM