Dune 2 OTT: ఓటీటీలోకి.. మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్లే హాలీవుడ్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌! తెలుగులోనూ..

ABN , Publish Date - Aug 01 , 2024 | 10:52 AM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో అద్భుత‌మైన సైన్స్‌ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ డూన్ పార్ట్‌2 ( డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మార్చి 1న థియేట‌ర్ల‌లో విడుద‌లై అల్‌టైం భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా న‌లిచింది.

dune 2

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి మ‌రో అద్భుత‌మైన సైన్స్‌ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ డూన్ పార్ట్‌2 (Dune: Part Two) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మార్చి 1న థియేట‌ర్ల‌లో విడుద‌లై అల్‌టైం బారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా న‌లిచింది. అంతేగాక‌ సుమారు రూ.1500 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.3వేల కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డం విశేషం. తిమోతీ చలమెట్, జెండయా, రెబెక్కా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్, ఫ్లోరెన్స్ పగ్ వంటి న‌టులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా డెనిస్ విల్లెనెయువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2021లో వ‌చ్చిన డ్యూన్ (Dune) చిత్రానికి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ డూన్ పార్ట్‌2 (Dune: Part Two) మొద‌టి భాగానికి మించి ఉత్కంఠ‌మైన స‌న్నివేశాలతో రూపొందించారు. భ‌విష్య‌త్‌లో 10వేల సంవ‌త్స‌రాల త‌ర్వాత అంత‌రిక్షంలో భూమి లాంటి గ్ర‌హాలు అనేకం ఉంటాయి. ఇందులో ఇంపీరియం అనే రాజ్యంలో ఓ చ‌క్ర‌వ‌ర్తి అధ్వ‌ర్యంలో చాలా రాజ్యాలు, తెగ‌లు నివ‌సిస్తుంటాయి. అదేవిధంగా హ‌ర్‌కెన‌న్, సార్దుక‌ర్, బెనె జెస‌రిట్ అనే మూడు ర‌కాల తెగ‌ల‌ సైన్యాలు ఉంటాయి. కెట‌డాన్ అనే గ్ర‌హంలో అట్రీడిస్ అనే రాజ‌వంశం లీట్ అనే రాజు, పాల్ అనే రాకుమారుడు ఉంటారు. అరాకిస్ ఎడారి గ్ర‌హంలో ప్రెమ‌న్ అనే తెగ జీవిస్తూ ఉంటుంది.


GT1jPuqbwAIpX3k.jpeg

అయితే చ‌క్ర‌వ‌ర్తి అదేశాల మేరకు అట్రీడిస్ రాజ్యం అంతా అరాకిస్ గ్ర‌హానికి వ‌చ్చేస్తుంది. ఈ క్ర‌మంలో వారు రావ‌డం ఏమాత్రం ఇష్టంలేని హ‌ర్‌కెన‌న్, సార్దుక‌ర్ గ్రూపులు కొన్ని కుట్ర‌లు చేసి చ‌క్ర‌వ‌ర్్తి సాయంతో అట్రిడీస్ రాజవంశంపై దాడి చేసి రాజును చంపేస్తారు. దీంతో రాకుమారుడు, త‌ల్లి జెస్సికా ఒంట‌రి వార‌వుతారు. ఆ ఎడారిలో ర‌హ‌స్యంగా నివసిస్తున్న ప్రెమ‌న్ తెగ వ‌ద్ద అశ్ర‌యం పొందుతారు. చివ‌ర‌గా హీరో రాకుమారుడు పాల్.. హీరోయిన్‌ ప్రెమ‌న్ తెగకు చెందిన చాని (Chani)ని క‌లవ‌డంతో మొద‌టి పార్ట్ ముగుస్తుంది.

ఇక‌ రెండో భాగంలో ప్రెమ‌న్ తెగ వ‌ద్ద అశ్ర‌యం పొందుతున్న పాల్ చానితో ప్రేమ‌లో ప‌డ‌డం, అక్క‌డి వారితో క‌లిసి గొరిల్లా దాడుల్లో పాట్టొంటూ ఉంటాడు. అంతేకాదు చిన్న‌గా మ‌రో ఒక‌టి రెండు తెగ‌ల సాయంను తీసుకుని హ‌ర్‌కెన‌న్, సార్దుక‌ర్ తిరుగుబాటుకు ప్ర‌య‌త్నిస్తాడు. చివ‌ర‌కు పాల్ వారిని ఎలా ఎదురించాడు, రాజ్యాన్ని ఎలా ద‌క్కించుకున్నాడు, చానిని పెళ్లి చేసుకున్నాడా లేదా చివ‌ర‌కు పాల్ ఇచ్చిన ట్విస్టు ఏంటి అనే ఆస‌క్తిక‌ర‌మైరన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఆక‌ట్టుకుంటుంది.

ముఖ్యంగా సినిమాలోని ఫొటోగ్ర‌ఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువ‌త్స్‌, యాక్ష‌న్ దృశ్యాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పుడీ సినిమా జియో సినిమా (Jio Cinema) ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ , డ‌బ్బింగ్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారు, థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఇంట్లోనే త‌ప్ప‌క చూడండి. వీలుంటే, స‌మ‌యం ల‌భిస్తే మొద‌టి భాగం చూసి ఈ రెండో భాగం చూస్తే సినిమా బాగా ఎక్కుతుంది.

Updated Date - Aug 01 , 2024 | 10:52 AM