Kota Factory: కోచింగ్ సెంట‌ర్ల క‌థలు.. ‘కోటా ఫ్యాక్టరీ’ కొత్త సీజ‌న్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Jun 20 , 2024 | 07:06 PM

ఇండియాలో చాలా ప్ర‌జాద‌ర‌ణ ఉన్న హిందీ వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్ట‌రీ కొత్త సీజ‌న్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా వ‌చ్చి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్న ఈ వెబ్ సిరీస్ ఆల్‌టైమ్ బెస్ట్ షోల‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది.

Kota Factory: కోచింగ్ సెంట‌ర్ల క‌థలు.. ‘కోటా ఫ్యాక్టరీ’ కొత్త సీజ‌న్ వ‌చ్చేసింది
Kota Factory

మ‌న ఇండియాలో చాలా ప్ర‌జాద‌ర‌ణ ఉన్న హిందీ వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్ట‌రీ ( Kota Factory) కొత్త సీజ‌న్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా వ‌చ్చి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్న ఈ వెబ్ సిరీస్ ఆల్‌టైమ్ బెస్ట్ షోల‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో 9.2పైగా రేటింగ్‌తో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. కాగా ఈ సిరీస్ బ్లాక్‌ అండ్ వైట్‌లో సాగుతూ మ‌న కాలేజ్ డేస్‌కు తీసుకెళుతుంది.మ‌యూర్ మోర్ (Mayur More), జితేంద్ర కుమార్ (Jitendra Kumar), ఉర్వి సింగ్ (Urvi Singh), రేవ‌తి పిళ్లై (Revathi Pillai), అహ్సాస్ చన్నా (Ahsaas Channa) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు.

kota.jpg

కోచింగ్ సెంటర్ల‌కు బాగా ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషనల్ హబ్ రాజస్థాన్‌లోని కోటా నేప‌థ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసి ఇంట‌ర్‌లో జాయిన్ అయిన వైభ‌వ్ అనే కుర్రాడు JEE and NEET ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతూ ఐఐటీ (IIT)లో చేరేందుకు చేసిన‌ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ సిరీస్ న‌డుస్తుంది. మ‌న దైనందిన జీవితంలో మ‌నకు ఎదురుప‌డే అనేక సంద‌ర్భాలు ఈ సిరీస్‌లో కండ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూయించారు.


FAdfbGkUcAEz9ah.jpeg

ముఖ్యంగా తల్లితండ్రుల ఆరాటాలు, కళాశాలల వ్యాపారాలు ఎలా ఉంటాయి, విద్యార్థుల చ‌దువు, అర్థిక‌ కష్టాలు ఎలా ఉంటాయి, వారి మ‌ధ్య‌ పోటీ వాతావ‌ర‌ణం ఏ స్థాయిలో ఉంటుంది, హాస్టల్ జీవితాలు ఎలా ఉంటాయనేది మ‌నం చూసిన, అనుభ‌వించిన ఘ‌ట‌న‌ల‌ను మ‌రోసారి గుర్తుకు తెస్తాయి. ఈ సిరీస్‌లో మొద‌టి రెండు భాగాలు ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోనూ, యూ ట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా జూన్ 20 (గురువారం) నుంచి కోటా ఫ్యాక్ట‌రీ 3వ సీజన్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటిలో మొద‌టి రెండు సీజ‌న్లు తెలుగులో అందుబాటులో ఉండ‌గా కొత్త‌గా వ‌చ్చ‌ని సీజ‌న్ 3 హిందీలో మాత్ర‌మే విడుద‌లైంది.

Updated Date - Jun 20 , 2024 | 07:06 PM