Harom Hara OTT: ‘హరోంహర’ ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడ!
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:02 PM
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా నటించిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). ఆయన నటించిన పూర్తిస్థాయి యాక్షన్ సినిమా ఇది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్థమైంది.
సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా నటించిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). ఆయన నటించిన పూర్తిస్థాయి యాక్షన్ సినిమా ఇది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్థమైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్. లక్కీ లక్ష్మణ్, రవి కాలే, సునీల్ తదితరులు నటించారు. జ్ఞాన సాగర ద్వారక దర్శకుడు.
కథ:
కుప్పం ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్), అతని తమ్ముడు బసవరెడ్డి (రవి కాలే) దారుణమైన అకృత్యాలకు పాల్పడుతుంటారు. వారికి భయపడి ఆ ఊరిలో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అలాంటి కుప్పం ఏరియాలో పాలిటెక్నిక్ కళాశాలలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం. అనుకోని పరిస్థితుల్లో తమ్మిరెడ్డి గ్యాంగ్‌తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అదే సమయంలో తండ్రి శివారెడ్డి (జయప్రకాశ్) చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యంపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బు సంసంపాదించడం కోసం తన మిత్రుడు, సస్పెండ్ అయిన పోలీస్ పళని స్వామి (సునీల్)తో కలిసి గన్స తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆయుధాల తయారీ వ్యాపారంలో సుబ్రహ్మణ్యం ఏ స్థాయికి వెళ్లాడు? ఈ క్రమంలో అతనికి ఎంత మంది శత్రువులయ్యారు? కుప్పం ప్రాంతాన్ని ఎలా రక్షించాడు అన్నది కథ.