Bhimaa Ott: ‘భీమా’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. గెట్ రెడీ
ABN , Publish Date - Mar 29 , 2024 | 08:51 AM
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భీమా’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా.. ఎన్నో అంచనాల నడుమ శివరాత్రి పండుగను పురస్కరించుకుని మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భీమా’ (Bheema) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ మాస్ ,యాక్షన్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), మాళవిక శర్మ(Malvika Sharma) హీరోయిన్లుగా నటించారు.
A సెంటర్లలో అంతగా ప్రభావం చూపని ఈ సినిమా B సెంటర్లలో మాత్రం అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఫైట్ సాక్వెన్స్‌ను అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) దక్కించుకోగా ఒప్పందానికి ముందే 25 రోజుల్లోనే చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకు వస్తున్నారు. ఏప్రిల్ 5 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయనుండగా ఇతర సౌత్ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
ఇక కథ విషయానికి వస్తే.. కర్ణాటకలోని పరశురామ క్షేత్రంగా వెలసిన మహేంద్రగిరి ఆనే ప్రాంతంలో పరశురాముడు ప్రతిష్టించిన మహిమ గల శివాలయం ఉంటుంది. ఎవరైనా కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలను ఆవహింపజేసే ప్రత్యేకత దానికి ఉంటుంది.
అంతేగాక ఆ ఆలయ పరిసరాల్లో కొన్ని సమయాల్లో చాలా అరుదైన ఔషధ మొక్కలు అభిస్తుంటాయి. అనుకోకుండా కొన్ని ఘటనల వళ్ల గుడిని మూసి వేయాల్సి వస్తుంది. అదే సమయంలో ఆ ఊరికి ఎస్సైగా భీమా (గోపీచంద్) వస్తాడు. ఆ గుడితో భీమాకు,రామాకు గల సంబంధం, ఆ ప్రాంతం నుంచి కొత్త విషయాలు బయట పడడం ఇలా ఆసక్తకరమైన రకథకథాలతో సినిమా సాగుతుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఏంచక్కా ఇక ఇంటిలోనే చూసేయవచ్చు.