BigBoss Telugu 8: గంగవ్వ ఫైర్.. నువ్వు దండగా అంటూ..
ABN , Publish Date - Oct 14 , 2024 | 05:57 PM
గంగవ్వ కూడా ఏ మాత్రం తగ్గకుండా కంటెస్టెంట్స్‌కి గట్టి షాక్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, హరితేజ మధ్యలో హై డ్రామా నడిచింది. ఈ వారం నామినేషన్స్ గరం గరం ఉండటంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..
బిగ్‌బాస్ డే 43 ప్రోమో హౌస్ మేట్స్‌లో రచ్చ రేపింది. మరో వైపు గంగవ్వ కూడా ఏ మాత్రం తగ్గకుండా కంటెస్టెంట్స్‌కి గట్టి షాక్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, హరితేజ మధ్యలో హై డ్రామా నడిచింది. ఈ వారం నామినేషన్స్ గరం గరం ఉండటంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..
నామినేషన్స్ జరుగుతున్న క్రమంలో గంగవ్వ ఛాన్స్ రాగానే వెంటనే పృథ్వీని నామినేట్ చేసింది. బీబీ హోటల్ టాస్కులో నువ్వు బాగా ఆడలేదంటూ తన ఒపీనియన్ తెలిపింది. మధ్యలో పృథ్వీ కలిగించుకుంటూ బాగానే ఆడాను అవ్వ కావాలంటే మీ అసిస్టెంట్ నయనిని అడగడండిఅన్నాడు. దీంతో ఫైర్ అయిన గంగవ్వ.. నా అసిస్టెంట్ నా దగ్గరే సరిగ్గా ఉండదు, నీ ఆట ఎం చూసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నయని మధ్యలో మాట్లాడటానికి ప్రయత్నించగా గంగవ్వ గట్టిగ నయనికి వార్నింగ్ ఇచ్చింది. దీంతో నిఖిల్ వేసిన నామినేషన్ కాదని ప్రేరణ గంగవ్వ నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించింది.
దీంతో పృథ్వీ ఎందుకు అంటూ అసహనానికి గురయ్యాడు. దీనికి ప్రేరణ చెప్పిన రీజన్ పృథ్వీకి నచ్చలేదు. పృథ్వీ వెంటనే యష్మీ దగ్గరికెళ్లి ప్రేరణని నామినేట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. మధ్యలో ప్రేరణ మాట్లాడటానికి వచ్చిన వెళ్ళిపోమన్నాడు. ఈ క్రమంలోనే ప్రేరణకి హెల్ప్ చేస్తే నీకూ నాకు పడుతుంది చూసుకో అంటూ పృథ్వీ.. నిఖిల్ కి వార్నింగ్ ఇచ్చాడు.
ఈ వారం నామినేట్ అయ్యింది వీరే..
1. పృథ్వీ
2. నిఖిల్
3. మణికంఠ
4. నబీల్
5. యష్మీ
6. ప్రేరణ
7. గౌతమ్
8. తేజ
9. హరితేజ