Love Me OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన దిల్ రాజు.. రోమాంటిక్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Jun 14 , 2024 | 07:57 AM

ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా న‌టించిన ల‌వ్‌మీ స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అరుణ్ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌గా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఎంఎం కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు.

Love Me OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన దిల్ రాజు.. రోమాంటిక్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌
love me

దిల్ రాజు సోద‌రుడి కుమారుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy) కథానాయకుడిగా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా న‌టించిన తాజా సూప‌ర్ హిట్ చిత్రం ల‌వ్‌మీ (Love Me) స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అరుణ్ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌గా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్ రెడ్డి (Harshith Reddy), హ‌న్షితా రెడ్డి (Hanshitha Reddy), నాగ మ‌ల్లిడి (Naga Mallidi) నిర్మించారు. ఎంఎం కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేశారు.

Love Me Movie Title Logo Launch

బేబి చిత్రం త‌ర్వాత వైష్ణవి చైతన్య న‌టించిన చిత్రం కావ‌డంతో భారీ అంచ‌నాల న‌డుమ మే 25 న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిశ్ర‌మ స్పంద‌న‌ను మాత్ర‌మే రాబ‌ట్టుకుంది. రామచంద్రంపురం అనే ఊర్లోని ఓ బంగళాలో అప్పుడే పెళ్ళైన ఒక జంట ఉంటుంది. కానీ ఆ యువ‌తి ఎవ‌రికీ క‌న‌బ‌డ‌దు, కానీ రాత్రి 8 అవగానే ఏడుపు మాత్రం వినిపిస్తుంటుంది. ఉన్న‌ట్టుండి ఆ యువ‌తి మంటల్లో కాలిపోయి చ‌నిపోతుంది. అక్క‌డో పాప క‌నిసిస్తుంది. ఆ తరువాత ఆ పాపకు ఏమైందో ఎవరికీ తెలియదు.


GPPLtcFbIAAhv18.jpeg

ప్రస్తుతానికి వస్తే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి) దెయ్యాలు, భూతానే కాన్సెప్ట్ అంటే విప‌రీత‌మైన మ‌క్కువ‌. వాటిపై త‌రుచూ వీడియోలు చేస్తుంటాడు, మిత్రుడు ప్రతాప్ (రవి కృష్ణ) వాటిని యూట్యూబ్‌లో పెడుతూ ఉంటాడు, వాటికి లక్షల్లో వ్యూస్ వ‌స్తుంటాయి. ఈక్ర‌మంలో ఒక‌సారి ప్రతాప్ అప్పుడెప్పుడో కనపడకుండా పోయిన పాప దివ్యావతి చనిపోయి దెయ్యం అయిందని, ఆమెను ఎవరూ రెండో సారి చూడలేరని, చంపేస్తుందని చెపుతాడు. దీంతో అర్జున్ ఆ పాడుపడ్డ బంగళాకు వెళతాడు, అక్కడ‌ ఆమెతో ప్రేమలో పడతాడు. ఈలోపు ప్రతాప్ అత‌ని ల‌వ‌ర్ (వైష్ణవి చైతన్య) ఇద్దరూ అర్జున్ కి సాయం చేయడానికి వస్తారు.

GJav26CbgAAx7il.jpeg

ఇంతకీ దివ్యావతి ఎవరు? ఆమె నిజంగానే దెయ్యమా, లేక బతికుందా? అర్జున్ కి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? చనిపోయినవాళ్ల పుర్రెను చూసి వాళ్ళ రూపురేఖలతో బొమ్మని తయారుచేసే పింకీ దివ్యావతి బొమ్మని కూడా చేసిందా? అనే ఇంట్రెస్టింగ్ సీన్ల‌తో సినిమా సాగుతుంటుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Jun 14 , 2024 | 09:59 AM