Committee Kurrollu OTT: ఓటీటీకి రెడీ.. ఎప్పుడు.. ఎక్కడంటే!
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:52 PM
పదకొండు మందికి పైగా కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేస్తూ నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.
పదకొండు మందికి పైగా కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేస్తూ నూతన దర్శకుడు యదు వంశీ 9yadu Vamsi) తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu OTT). థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచి, ప్రేక్షకుల్ని బాల్యానికి తీసుకెళ్లిన ఈ చిత్రం త్వరలో ఈ టీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులోనే రాబోతున్నారు’ అంటూ ఓటీటీ (Etv win Ott) సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబరు తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కథ:
గోదావరి జిల్లాల్లోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తం పల్లి. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే భరింకాళమ్మతల్లి జాతర. దానిలో భాగంగా చేసే బలి చేట ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన పదిరోజులు ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి (సాయికుమార్)పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్లలో ఒకడైన శివ (సందీప్ సరోజ్) ముందుకొసాగడు. అయితే గత జాతర సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయితీలో ఊరి పెద్దలు తీర్పునిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? పన్నెండేళ్ల క్రితం కులాల గొడవ వల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్కటయ్యింది? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నది మిగిలిన కథ.