Yevam OTT: ఓటీటీకి వ‌చ్చేసిన.. రీసెంట్ టాలీవుడ్ థ్రిల్ల‌ర్

ABN , Publish Date - Jul 25 , 2024 | 12:53 PM

రీసెంట్ టాలీవుడ్ థ్రిల్ల‌ర్ 'యేవ‌మ్‌' డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్ వ‌చ్చిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

yevam

రీసెంట్ టాలీవుడ్ థ్రిల్ల‌ర్ 'యేవ‌మ్‌' (Yevam) డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్ వ‌చ్చిన ఈ మూవీ గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు నెల రోజుల త‌ర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. చాందిని చౌద‌రి (Chandini Chowdary), వ‌శిష్ట సింహా (Vasishta N Simha), భరత్‌రాజ్ (Jai Bharat Raj), ఆషు రెడ్డి (Ashu Reddy) ముఖ్య తారలుగా న‌టించిన ఈ సినిమాకు ప్రకాష్‌ దంతులూరి (Prakash Dantuluri) దర్శకుడు, నవదీప్ (Navdeep), పవన్‌ గోపరాజు (Pavan Kishore) నిర్మాతలు.

Yevam-Movie.jpg

ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేకున్నా పోలీస్ ఉద్యోగం చేస్తుంటుంది సౌమ్య‌. అయితే ఓ మ‌హిళ మ‌ర్డ‌ర్ వైర‌ల్ అవుతుంది. అంతేగాక‌ హీరోల పేర్లు చెప్పి యుగంధ‌ర్ అనే వ్య‌క్తి అమ్మాయిల‌ను ట్రాప్ చేస్తున్న విష‌యం తెలిసి పోలీసులు అల‌ర్ట్ అవుతారు. ఈక్ర‌మంలో సౌమ్య సాధార‌ణ యువ‌తిగా అ ట్రాప్‌లోకి వెళుతుంది. కానీ యాక్షిడెంట్ అయి ఫ్లాన్ ఫెయిల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో త‌న పై అధికారి అభికి ద‌గ్గ‌ర‌వుతుంటుంది.


yevam.jpg

అయితే ఈ క్ర‌మంలోనే సౌమ్య‌కు కొత్త కొత్త విష‌యాలు తెలిసి షాక‌వుతుంది. చివ‌ర‌కు పోలీసులు యుగంధ‌ర్‌ను ప‌ట్టుకున్నారా, అభి భార్య ఎందుకు వ‌దిలేసింది, వాళ్ల‌కు ఈ కేసుతో లింకేంటి సౌమ్య ఈ కేసు ఎలా డీల్ చేసింది? అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.

Updated Date - Jul 25 , 2024 | 12:53 PM